“సాగర్‌”పై సర్వశక్తులు ఒడ్డుతున్న కేసీఆర్..!

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఇప్పుడు టీఆర్ఎస్‌కు డూ ఆర్ డై ఫైట్‌లా మారిపోయింది. తమ ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవడానికి టీఆర్ఎస్‌కు ఇప్పుడు ఉన్న చాయిస్ అదొక్కటే. అందుకే నేరుగా రంగంలోకి కేసీఆర్ దిగారు. ఇప్పటికే తెర వెనుక పనులన్నీ పూర్తి చేస్తున్నారు. నోటిఫికేషన్ రాక ముందే ఒకటి రెండు సార్లు సాగర్లో పర్యటించనున్నారు. పదో తేదీన భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు. దీనికి కేసీఆర్ హాజరవుతున్నారు. నాగార్జునసాగర్‌లో భారీ మెజార్టీతో గెలిచి టీఆర్ఎస్ బీజేపీ గెలుపులు గాలి బుడగతో సమానం అని తేల్చేలేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు.

ఇప్పటికే నాగార్జున సాగర్ నియోజకవర్గానికి మేలు చేసే అనేక ప్రాజెక్టులు.. పథకాలను మంజూరు చేస్తూ జీవోలిచ్చారు. వాటి విషయంలో ప్రజల్లోసానుకూల చర్చ జరిగేలా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. అంత కంటే మంచి పనులుచేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడంతో.. టీఆర్ఎస్ శ్రేణులు కూడా… ఉత్సాహంగా ఉన్నాయి.మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కాస్త ఆత్మరక్షణ ధోరణిలో ఉన్న టీఆర్ఎస్… చావో రేవో అన్నట్లుగా సాగర్‌లో పోటీ పడాలని భావిస్తోంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం చేయలేదు. దుబ్బాకలోనూ చివరి రోజు బహిరంగసభ పెడతారని ప్రచారం జరిగింది కానీ.. ఆయన లైట్ తీసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో చివరికి ఓ సభ పెట్టారు కానీ ప్రయోజనం లేకపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ సారి నాగార్జునసాగర్‌లో ముందుగానే బహిరంగసభ నిర్వహించి.. ప్రజల్లో.. పార్టీ శ్రేణుల్లో కదలిక తేవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఉపఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ ఎదురు చూడకుండా ముందుగానే కసరత్తుచేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close