కేసీఆర్ అసలు సాక్ష్యాలు రిలీజ్ చేయలేదట !

ఫామ్ హౌస్ కేసులో బీజేపీ బండారం అతా బయటపెడతానంటూ కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. గంటల కొద్దీ వీడియో ఫుటేజీని విడుదల చేశారు. వాటన్నింటినీ అన్ని రాష్ట్రాల చీప్ జస్టిస్‌లకు.. సుప్రీంకోర్టుకు కూడా పంపుతున్నట్లుగా ప్రకటించారు. ఇదంతా బహిరంగం. అయితే ఇప్పుడు అనూహ్యంగా అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ కేసులో ఎలాంటి సాక్ష్యాలు రిలీజ్ చేయలేదని చెప్పుకోవాల్సి వస్తోంది. కోర్టులను కూడా నమ్మించాల్సిన పరిస్థితి వచ్చింది.

హైకోర్టు సింగిల్ బెంచ్ ఫామ్ హౌస్ కేసును సీబీఐకి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. సీబీఐకి ఇవ్వవొద్దని హైకోర్టు డివిజనల్ బెంచ్ ముందు ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. ఈ అప్పీల్ పై విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది అసలు కేసీఆర్ సాక్ష్యాలు రిలీజ్ చేయలేదని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చి ఉంటారని చెప్పారని..కానీ అలా జరగలేదని ప్రభుత్వం తరపు లాయర్ న్యాయమూర్తికి వివరించారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కోర్టుకు సరైన సమాచారం అందించలేకపోయారని చెప్పారు.

సీఎం ప్రెస్ మీట్ కు ముందే ఆ వీడియోలు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేవలం ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని సాకుగా చూపి కేసులో సీబీఐకు అప్పగించడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుంటే పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అందుకే ప్రెస్ మీట్ పెట్టారని వాదించారు. ఈ కేసు వ్యవహారం చుట్టూ తిరిగి కేసీఆర్, పోలీసు ఉన్నతాధికారుల దగ్గరు వస్తుందని న్యాయనిపుణులు చెబుతున్న సమయంలో అసలు పబ్లిక్ డోమైన్‌లో ఉన్న వాటినే కేసీఆర్ రిలీజ్ చేశారని.. ఆయనకు ఎవరూ ఇవ్వలేదని వాదించడం ప్రారంభించారు. వాదనలు శుక్రవారం కూడా జరగనున్నాయి. సీబీఐ విచారణకే కట్టుబడాలా లేక సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలా అన్నది చీఫ్ జస్టిస్ బెంచ్ నిర్ణయం తీసుకోనుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close