మద్యం దుకాణాల్లోనూ కేసీఆర్ సామాజిక న్యాయం !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ చేయని విధంగా సామాజిక న్యాయం చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు. చివరికి మద్యం దుకాణాల్లోనూ అందరికీ సమానంగా న్యాయం చేసేందుకు రిజర్వేషన్లు తీసుకు వచ్చారు. ఈ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌ను కూడా నెల రోజుల పాటు గడువు పొడిగించారు. అంతకు ముందు పొడిగించే చాన్సే లేదని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు రిజర్వేష‌న్లను ఖరారు చేసి.. అమలు చేయడానికి సమయం కావాలి కాబట్టి నెల రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటి వరకూ మద్యం దుకాణాల టెండర్లకు ఎలాంటి రిజర్వేషన్లు లేవు. ఎవరు ఎక్కువగా టెండర్ వేస్తే వారికే షాపులు దక్కేవి. ఇప్పుడు రిజర్వేషన్లు కేటాయిస్తున్నారు. గౌడ్ సామాజికవర్గం ఎక్కువగా కల్లు, మద్యం వ్యాపారాల్లో ఉంటుంది కాబట్టి వారికి అత్యధిక రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. పదిహేను శాతం మద్యం దుకాణాలు వారికే కేటాయిస్తారు. మరో పది శాతం ఎస్సీలకు.. మరో ఐదు శాతం ఎస్టీలకు కేటాయిస్తారు. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని చెప్పి జీవో రిలీజ్ చేశారు.

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్‌లు రెండేళ్లకోసారి ఇస్తారు. ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల లైసెన్స్‌ల గడువు ఈ నెలతో ముగుస్తుంది. తర్వాత గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయిస్తారు. ఇప్పటి వరకూ రిజర్వేషన్లు కల్పించకపోయినా గౌడ్ సామాజికవర్గానికి చెందిన మద్యం వ్యాపారులు పెద్ద ఎత్తున దుకాణాలు దక్కించుకుంటూ ఉంటారు. అయితే ఈ సారి పదిహేను శాతం వారికే కేటాయించడం వారికి సౌలభ్యం. అయితే ఎస్సీ, ఎస్టీల పేరుతో దుకాణాలను దక్కించుకుని నిర్వహించుకునేందుకు ఇతర బలవంతులకు ఈ రిజర్వేషన్ల ద్వారా అవకాశం దక్కనుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంజాయి కట్టడికి కేసీఆర్ స్పెషల్ ఆపరేషన్ !

ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. ఏపీలోని విశాఖ మన్యం నుంచే గంజాయి దేశం మొత్తం రవాణా అవుతోందని ఐదారు రాష్ట్రాల పోలీసులు వస్తున్నారని స్వయంగా పోలీసు ఉన్నతాధికారులే చెబుతున్నారు....

చేతకాని దద్దమ్మలే తిడతారన్న సజ్జల !

ఏదైనా తమ దాకా వస్తే కానీ దెబ్బ రుచి తెలియదన్నట్లుగా ఉంది వైసీపీ నేతల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంత కాలం ఇష్టం వచ్చినట్లుగా టీడీపీ నేతల్ని అమ్మనా బూతులు...

బ్రేకింగ్ : కోర్టు మెట్లెక్కిన సమంత

సమంత కోర్టుని ఆశ్రయించింది. తన పరువుకి భంగంవాటిల్లిందని పలు యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువు నష్టం దావా వేసింది. సుమన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీతోపాటు సీఎల్‌ వెంకట్రావుపై కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్‌...

‘ఆర్య’ని మారిస్తే ‘అల్లు’ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా ?

'ఆర్య'.. తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ పరిచయం చేసిన హీరోయిక్ పాత్ర. ఆర్య సినిమాతోనే అల్లు అర్జున్ తొలి కమర్షియల్ విజయం దక్కింది. ఆర్యతోనే సుకుమార్ అనే దర్శకుడు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు....

HOT NEWS

[X] Close
[X] Close