మళ్ళీ కలిసిన తెలుగు చంద్రులు, కేసీఆర్‌కు ఆంధ్రా స్పెషల్స్‌తో విందు

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆయుత చండీయాగానికి ఆహ్వానించటానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం ఉన్న ఉండవల్లిలోని హెలిప్యాడ్‌లో కేసీఆర్ ఛాపర్ ల్యాండ్ అయ్యింది. కేసీఆర్ వెంట మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఉన్నారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు యనమల, చినరాజప్ప, రావెల కిషోర్ బాబు వారికి స్వాగతం పలికారు. ఛాపర్‌నుంచి దిగి అక్కడ ఏర్పాటుచేసిన వాహనంలో చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఇంటివద్ద బయటే నిలుచున్న చంద్రబాబు కేసీఆర్‌కు పుష్పగుఛ్ఛంతో స్వాగతం పలికారు. కేసీఆర్‌కు శాలువా కప్పి సత్కరించారు. లోపలికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ చంద్రబాబును శాలువా కప్పి సత్కరించి తర్వాత ఆయుత చండీయాగానికి ఆహ్వానపత్రికను, నూతన వస్త్రాలను, స్వీట్స్, పళ్ళు, పూలు ఇతర కానుకలను ఇచ్చారు. మీడియా ముందటే ఇరు రాష్ట్రాల నేతలూ ముచ్చటించుకున్నారు. గతంలో మనపార్టీలో ఉన్నప్పుడు కూడా యాగం చేశారు కదా అని చంద్రబాబు కేసీఆర్‌ను అడిగారు. అవునని, కానీ అప్పుడు మీడియా హడావుడి లేదుకాదా అని కేసీఆర్ చమత్కరిస్తూ, ప్రస్తుత యాగ విశిష్టతను తెలియజేశారు.

మరోవైపు కేసీఆర్, రాజేందర్, సుమన్‌లకు ఆంధ్రా ప్రత్యేక వంటకాలతో చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ విందులో కేసీఆర్‌కు ఇష్టమైన నాటుకోడి కూర, రొయ్యల ఇగురు, చేపల పులుసు, ఉలవచారు బిర్యానీ, గోంగూర, క్యారెట్ బొబ్బట్లు, కాకినాడ కాజా తదితర 15 ప్రత్యేక వంటకాలను విజయవాడకు స్వీట్ మ్యాజిక్ హోటల్‌కు చెందిన షెఫ్‌లతో చేయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close