రాష్ట్రపతి విందు కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా

హైదరాబాద్: తెలంగాణ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ రాజభవన్‌లో ఇవాళ సాయంత్రం ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు. జ్వరం కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు రాజ్‌భవన్‌కు సమాచారం అందింది. ఉదయంనుంచే ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. ఈ విందుకు హాజరయ్యే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎదురుపడటానికి ఇష్టంలేకే కేసీఆర్ గైర్హాజరవుతున్నారన్న వాదన వినబడుతోంది. మరోవైపు చంద్రబాబునాయుడు, హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ దిలీప్ బాబా సాహెబ్ భోస్లే, ఇరు రాష్ట్రాల డీజీపీలు, సీఎస్‌లు, ఇతర ఉన్నతాధికారులు ఈ విందుకు హాజరయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com