ధరణి పోర్టల్‌ దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌: సీఎం కేసీఆర్‌

రెవిన్యూ సంస్కరణల్లో దేశానికే తెలంగాణ ఆదర్శమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త రెవిన్యూ చట్టానికి అనుగుణంగా అక్రమాల్లేని సరికొత్త విధానం కోసం ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. కొన్నాళ్లుగా ఆగిపోయిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభించారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రం మరో రెండు వారాల తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ధరణి పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. కొత్త విధానం వల్ల.. వ్యవసాయ భూములను తహశీల్‌దార్లే రిజిస్ట్రేషన్ చేస్తారు. తహసీల్దార్ల వేలిముద్రలతోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి పూర్తి అవుతుంది. తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తి చేస్తారు. వ్యవసాయేతర భూములకు సంబంధిచి ప్రతి ఓపెన్ ప్లాట్ దారుడు నాన్ అగ్రికల్చర్ ఆస్తిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్లాట్ల వివరాలు వెబ్‌సైట్‌లో కనిపించొద్దనుకుంటే హైడ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. పూర్తి టైటిల్ విషయంలో ఓనర్ నష్టపోతే ప్రభుత్వమే పరిహారం ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

రైతుల భూములకు సంపూర్ణ రక్షణ కోసమే ధరణి పోర్టల్‌ ప్రారంభించామని.. ఒక తప్పు జరిగితే భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడతాయన్నారు. తప్పటడుగులు లేకుండా రైతుల కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు… ధరణి పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవాళ్లు కూడా వారి భూముల వివరాలు చూసుకోవచ్చని కేసీఆర్ ప్రకటించారు. ఇక అక్రమ రిజిస్ట్రేషన్లకు తావు లేకుంా… కొత్తగా జరిగే క్రయ, విక్రయాలు నమోదు నిమిషాల్లో పూర్తవుతాయన్నారు. ధరణి పోర్టల్‌ నమూనా పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయని వాటి ఆధారంగా ఎవరికివారే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని కేసీఆర్ తెలిపారు.

కొత్తగా డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఎవరు పడితే వారు కాకుండా… జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తారు. డాక్యుమెంట్‌ రైటర్లు తీసుకోవాల్సిన ఫీజును కూడా నిర్ణయిస్తారు. పాత రిజిస్ట్రేషన్‌ ఛార్జీలే ఉంటాయని.. రూపాయి కూడా పెంచలేదన్నారు. ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు రావని కేసీఆర్ తేల్చి చెప్పారు. చాలా రోజులుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో అంతా గందరగోళంగా మారింది. ఇప్పుడు కూడా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మాత్రమే ప్రారంభమయ్యాయి. ఇళ్లు ఇతర రిజిస్ట్రేషన్లకు మాత్రం మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close