అపర భగీరధుడే..! కేసీఆర్ సంకల్పానికి సాక్ష్యం..కాళేశ్వరం..!

కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును నిర్మించాలంటే.. దశాబ్దాలు పడుతుంది. కానీ కేసీఆర్..మూడేళ్లలోనే సాకారం చేశారు. 2016 మార్చి 8న దశాబ్దాల తరబడి కొనసాగిన వివాదాలకు స్వస్తి పలుకుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. దీని ఫలితంగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమయింది. 2016 మే 2న కన్నెపల్లి వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మూడేళ్ళ స్వల్ప వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైన బ్యారేజిలు, పంపుహౌజుల నిర్మాణం పూర్తయింది.

తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్..!

తెలంగాణా వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఎనభై వేల కోట్లతో నిర్మిస్తున్నారు.2016 మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నెపల్లి వద్ద శంఖుస్థాపన చేసారు.రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు.నీటి లభ్యత ఉన్న సమయంలో రోజుకు రెండు టిఎంసీల చొప్పుున 140టిఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోయనున్నారు.దీని కోసం చిన్నా,పెద్దవి కలిపి 141 టిఎంసీల సామర్థ్యం ఉన్న 19 జలాశయాలను నిర్మిస్తున్నారు.ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నీటిని తరలించేందుకు ప్రధానంగా మూడు బ్యారేజీలు నిర్మించారు. మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న కాళేశ్వరం బ్యారేజీలో 16.17 టిఎంసి,అన్నారం బ్యారేజీలో 10.87టిఎంసీ,సుందిళ్ల బ్యారేజీలో 8.87 టిఎంసిల నీరు నిల్వ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అన్నింటికంటే ఎక్కువగా మల్లన్న సాగర్ జలాశయంను 50 టిఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు…కాళేశ్వరం ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు నీరందించనున్నారు.దీంట్లో 18 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ కాగా కొత్తగా మరో 18 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తారు.ఏడాది నుండి రోజుకు రెండు టిఎంసీల నీటిని తరలిస్తారు.కాగా వచ్చే ఏడాది నుండి అదనంగా రోజుకు మూడు టిఎంసీల నీటిని తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎత్తిపోతల్లో దేశంలోనే ఎవరూ చేయని ప్రయోగం..!

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వంద మీటర్ల లోతులో ఉండే గోదావరి నుండి 618 మీటర్ల ఎత్తుకు ఆరు దశల్లో నీటిని ఎత్తిపోస్తారు.ఈ స్థాయిలో నీటిని ఎత్తిపోసేందుకు భారీ మోటార్ పంపులను విదేశాల నుండి తెప్పించారు.ఈ ప్రాజెక్టు నుండి నీటిని ఎత్తిపోసేందుకు 4992 మెగా వాట్ల విద్యుత్ అవసరమవుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 203 కిమీ సొరంగ మార్గాలు కూడా తవ్వారు. తెలంగాణాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21 ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమానికి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్,మహారాష్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను స్వయంగా వెళ్లి ఆహ్యానించాలని నిర్ణయించారు..ఢిల్లీ పర్యటన తర్వాత,17న అమరావతికి,తర్వాత ముంబై కి వెళ్లనున్నారు…సిఎం చేతుల మీదుగా ప్రారంభించిన తర్వాత జూలై నుండి నీటిని తరలించాలని నిర్ణయించారు..ఈ ఏడాది కొన్ని జలాశయాల్లో,చెరువులను గోదావరి నీటితో నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు…

తెలంగాణలో 70 శాతం భూభాగానికి సాగు, తాగు నీరు..!

తెలంగాణ భూభాగంలోని దాదాపు 70 శాతం జిల్లాలకు సాగుకు, తాగుకు, పరిశ్రమలకు నీరు అందించడానికి ప్రతిపాదించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. దేశ నీటి పారుదల రంగంలో సరికొత్త రికార్డు సృష్టిస్తున్న ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నెల నుంచే నీటి పంపింగ్ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మానవ నిర్మిత అద్భుతంగా నిలుస్తుందని సి.డబ్ల్యు.సి. అధికారుల నుంచి మొదలుకుని వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, నీటి పారుదల నిపుణులు కితాబిచ్చిన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే శరవేగంగా నిర్మితమైన భారీ ఎత్తిపోతల పథకం. మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో గోదావరి నీళ్లను ఆరు దశల్లో లిఫ్టు చేసి 618 మీటర్ల ఎత్తులో ఉండే కొండపోచమ్మ సాగర్ వరకు తరలిస్తారు. అంటే గోదావరి నది నీళ్లను అరకిలోమీటరుకు పైగా ఎత్తుకు లిఫ్టు చేస్తారు. ఈ ఏడాది ప్రతీ రోజు రెండు టి.ఎం.సి.లను ఎత్తిపోయడానికి అనువుగా పంపుహౌజులు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రతీ రోజు మూడు టిఎంసిల చొప్పున ఎత్తిపోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున నీటిని లిప్టు చేయడానికి దేశంలో గతంలో ఎన్నడూ వాడనంత పెద్ద సైజు పంపులను వాడుతున్నారు. మొత్తంగా తెలంగాణలోని 40 లక్షల ఎకరాలకు ప్రతీ ఏడాది రెండు పంటలకు నీరందుతుంది. ఏటా 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయి. అందుకే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయనిగా నిలవబోతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల నీరు ఎత్తిపోయడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతుంది. మూడు టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి 7,152 మెగావాట్ల విద్యుత్తు అవసరం పడుతుందని అంచనా వేశారు. దీనికి తగినట్టుగానే ఏర్పాట్లు చేశారు.

ఇప్పుడు ఇది తెలంగాణకు వరప్రదాయనిగా మారబోతోంది. చరిత్రలో కేసీఆర్ పేరును సుస్థిరంగా ఉంచబోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close