మీడియా వాచ్ : ఆర్కేపై కేసీఆర్ మీడియా యుద్ధం !

కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని ప్రకటిచింన తర్వాత … అది అయ్యే పని కాదని రాస్తోంది… కేసీఆర్ రాజకీయ అడుగులు అతిశయోక్తితో కూడుకున్నవని చెబుతోంది… తెలంగాణలో ఆంధ్రజ్యోతి ఒక్కటే. అందులో నిజం ఉందని ఎక్కువ మంది అనుకుంటారు . కానీ తెలంగాణలో ప్రో బీఆర్ఎస్ మీడియాదే హవా. టీవీ చానళ్లు, మీడియా మొత్తం అంతే. అయితే ఆంధ్రజ్యోతి మాత్రమే భిన్నం. ఆ పత్రిక కథనాలతో పాటు ఆర్కే వారాంతంలో రాసే కొత్త పలుకు ఆర్టికల్స్ లోనూ … బీఆర్ఎస్ అయ్యేది పొయ్యేది కాదని చెబుతూంటారు.

ఇంత కాలం చూసిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇక ఆయనపైనా ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా ఉన్నారు. నమస్తే తెలంగాణ ఒక్క సారిగా ఎడిట్ పేజీలో ఆర్టికల్స్ ప్రచురించడం ప్రారంభించారు. ఎల్లో మీడియా పుల్లారావుల పేరుతో .. సవాల్ రెడ్డి బై లైన్ తో ఎడిట్ పేజీ మొత్తం కేటాయించారు. అయితే అంతటితో అయిపోలేదు.. రేపు కూడా మరో సీరిస్ ఉంటుందని ప్రకటించారు. రాధాకృష్ణకు రాత కృష్ణ అని పేరు పెట్టారు. బీఆర్ఎస్ పార్టీపై మొదటి నుంచి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ వ్యాసంలో తీవ్రంగా విరుచుకుపడ్డారు.

సవాల్ రెడ్డి పేరుతో రాస్తున్నది స్వయంగా ఎడిటరేనని.. ఆయన ఆంధ్రజ్యోతి నుంచి వచ్చిన జర్నలిస్టేనన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ కౌంటర్ వల్ల ఆర్కేకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే…. చెప్పడం కష్టమే. ఎందుకంటే… ఆర్కే ఏం రాసినా అది తెలంగాణ వరకే.. కేసీఆర్ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉంటుంది. సభలకు ఎవరొచ్చారు.. ఎవరు రాలేదన్నది తెలిసిపోతుంది. ఆర్కే రాసే కొత్త పలుకు వల్ల బీఆర్ఎస్‌కు జరిగే
నష్టం ఏమీ ఉండదు.

కానీ తెలంగాణలో వ్యతిరేకంగా రాస్తున్న ఆ ఒక్క పత్రికను కంట్రోల్ చేయాలని బీఆర్ఎస్ చీఫ్ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆర్కే ఇలాంటి వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని మరింతగా రాస్తారనే సంగతి .. కేసీఆర్‌కు అందరి కంటే బాగా ఎక్కువ తెలుసని మీడియా సమాజంలో అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్, ఆర్కే ఒకప్పుడు ఆప్తమిత్రులు మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత ఏమైనా దిల్ రాజు కూతురా..?

సినిమాపై ప్యాష‌న్ ఉన్న నిర్మాత దిల్ రాజు. ఓ స‌బ్జెక్ట్ న‌చ్చితే ఎంతైనా ఖ‌ర్చు పెడ‌తారు. గుణ‌శేఖ‌ర్ కూడా అంతే. త‌న క‌ల‌ల చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి ఏం చేయ‌డానికైనా సిద్ద‌మే. అందుకే...

ఈ సారి రాజమండ్రిలో టీడీపీ మహానాడు !

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అతి పెద్ద సభను నిర్వహించేందుకు సిద్ధమయింది. ఒంగోలు మహానాడు నుంచి ఆ పార్టీలో జోష్ పెరగ్గా ఈ సారి ఎన్నికలకు ముందు రాజమండ్రిలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించుకుంది....

హెచ్‌ఎండీఏ కంటే సీఆర్డీఏ పెద్దది…కానీ : కేటీఆర్

హైదరాబాద్ కంటే అమరావతి పెద్దది. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేసిన హెచ్‌ఎండీఏ కంటే... ఏపీ కొత్త రాజధాని సీఆర్డీఏ విస్తీర్ణం చాలా పెద్దది. ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది తెలంగాణ మంత్రి...

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కావాలట !

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అధికారులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close