ఎమ్మెల్సీ ఎన్నికల భయం.. రూ. 250 కోట్లు రిలీజ్ చేసిన కేసీఆర్!

సొంత పార్టీ క్యాడరే అయినా వారిని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తే.. వారికి పార్టీ.. గీర్టీ ఏమీ ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడిప్పుడే బోధపడుతున్నట్లుగా ఉంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అనివార్యం కావడంతో ఇప్పుడు ఆ పార్టీకి చెందిన ఓటర్లు కూడా ఆ పార్టీకి ఓటు వేస్తారా అనే డౌట్ ప్రారంభమయింది. అందుకే ఇతరులే గెలవబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 70 శాతం మంది ఓటర్లు ఉన్నారు. కానీ చివరికి మెదక్ ఓటర్లను కూడా క్యాంపులకు తరలించారు.

దీనికి కారణంగా టీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధుల్లోనే చాలా మందికి తీవ్ర అసంతృప్తి ఉంది. దీనికి కారణం వారికి ఆర్థికంగా లాభంచేయకపోవడం కాదు.. ఆర్థికంగా చితికిపోయేలా చేయడం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా గెలిచిన వారు పనులు చేపట్టారు. కానీ ఆ బిల్లులు రాలేదు. దీంతో అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు.ఇప్పుడు వారంతా తమకు ఓ అవకాశం వచ్చిందని అనుకుంటున్నారు. ఈ ప్రమాదం పసిగట్టిన కేసీఆర్.. ఎన్నికలపై ప్రత్యేకంగా సమీక్ష జరిపారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బిల్లులను రూ. 250కోట్లు తక్షణం విడుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు .

క్యాంపుల్లో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వెలిబుచ్చుతున్న అసంతృప్తిని నేతలు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే జిల్లా, మండల పరిషత్‌ల అభివృద్ధికి రూ. 250 కోట్లను తక్షణమే విడుదల చేయాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లిని సీఎం ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు మాటలకే నని ఎన్నికలయ్యే వరకూ అవి విడుదల కావని.. ఆ తర్వాత పట్టించుకోరని.. టీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే కేసీఆర్ వ్యూహం ఎన్నికల ముందు ఇలాంటి ఆశలు కల్పించడం.. తర్వాత జెల్లకొట్టడమేనని వారికి అవగాహన అయిందని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఒక్క ఎమ్మెల్సీ స్థానం పోయినా కేసీఆర్‌కు మరింత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ కంటే ఏపీకి రెట్టింపు పన్నుల వాటా రిలీజ్ చేసిన కేంద్రం !

ఏపీకి నిధుల విషయంలో అన్నీ కలసి వస్తున్నాయి. ధనిక రాష్ట్రం.. కేంద్రానికి పెద్ద ఎత్తున పన్నులు సంపాదించి పెట్టే తెలంగాణ కంటే.. రెట్టింపు పన్నుల వాటా నిధులు ఏపీకి వస్తున్నాయి. కేంద్రం తాజాగా...

మ‌ళ్లీ రంగంలోకి దిగుతున్న చిరు

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం తీవ్రంగా ఉండ‌డంతో అగ్ర క‌థానాయ‌కులంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. షూటింగుల‌కు రామ‌ని చెప్పేశారు. చిరంజీవి కూడా త‌న చేతిలో సినిమాల‌న్నీ ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న మేక‌ప్...

పెద్ద బ్యాన‌ర్ల చేతిలో ప‌డిన శ్రీ‌కాంత్ త‌న‌యుడు

ఈమ‌ధ్య పెద్ద బ్యాన‌ర్లు చిన్న సినిమాల‌పై దృష్టి నిలిపాయి. `జాతిర‌త్నాలు`తో చిన్న‌సినిమాల వ‌ల్ల ఉన్న లాభాలేమిటో అశ్వ‌నీద‌త్ లాంటి అగ్ర నిర్మాత‌కు బాగా అర్థ‌మైంది. అందుకే ఇప్పుడు మ‌రో చిన్న సినిమాకి...

ఉద్యోగుల్ని రెచ్చగొడుతున్న మంత్రులు, ప్రభుత్వం !

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని పాత జీతాలే ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన ఉద్యోగులను ప్రభుత్వం మరింతగా రెచ్చగొడుతోంది. జీతాల బిల్లులను వెంటనే ప్రాసెస్ చేయాలని ట్రెజరీలకు ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు రోడ్డెక్కినప్పటికీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close