టీఆర్ఎస్‌కు ప్రజలే బాస్‌లు: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రజలే బాస్‌లని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి గండిపల్లి, గౌరెల్లి రిజర్వాయర్‌లను పరిశీలించారు. తర్వాత ముల్కనూరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాల నాయకులు సమ్మెలు చేయిస్తున్నారని అన్నారు. ఈ నాయకులందరూ ఆయా పార్టీలలో గుమాస్తాలుగా చేసినవాళ్ళేగానీ, పార్టీకి అధ్యక్షుడిగాగానీ, ముఖ్యమంత్రిగాగానీ చేయలేదని ఎద్దేవా చేశారు. పారిశుధ్య కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని అన్నారు. రెండున్నర ఏళ్ళలో 1.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ళ తప్పుడు ప్రాజెక్ట్ అని, దీని రీ ఇంజనీరింగ్‌పై రాద్ధాంతం చేయొద్దని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి అన్నారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేసినట్లు తానెప్పుడూ చెప్పలేదని, ఆ ప్రాజెక్ట్ కావాలా, వద్దా అన్నది ఇంజనీర్లే తేలుస్తారని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close