మోడీకి కేసీఆర్ మరో వ్యతిరేక లేఖ…జగన్‌కు మాత్రం ధైర్యం చాలట్లేదా !?

ఏపీలో రాజకీయం అంతా అధికారుల్ని అడ్డం పెట్టుకునే చేస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు భయంతో ప్రభుత్వం ఏం చేయమన్నా చేస్తున్నారు. ఏ రకమైన స్టేట్‌మెంట్లు ఇవ్వమన్నా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ఆ సివిల్ సర్వీస్ అధికారులందర్నీ తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. కేడర్ రూల్స్ మార్చేస్తోంది. ఎప్పుడు కేంద్రానికి రావాలంటే అప్పుడు వచ్చేలా రూల్స్ మార్చేస్తోంది. దీన్ని బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఎలాగూ వ్యతిరేకించలేవు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి.

ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకించి తీరాలి. లేకపోతే కీలకమైన సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోతారు. అప్పుడు చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేడర్ రూల్స్ మార్పును అంగీకరించబోమన్నారు. కేసీఆర్ మాత్రమే కాదు కేరళ జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ చివరికి బిహార్‌లో బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వాగతించాలన్న ఆలోచనలో ఉన్నారు.

మొత్తం కేంద్రం గుప్పిట్లోకి తీసుకున్నా ఎందుకు స్వాగతించే ఆలోచనలో ఉన్నారో ఏపీ ప్రజలకు బాగానే తెలుసు. కానీ హక్కులన్నీ ధారాదత్తం చేసి తర్వాత తమను తాము ఎలా కాపాడుకుంటారన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. కేంద్రానికి ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేని దుస్థితిని ఆసరా చేసుకుని కేంద్రం కూడా ఒక్కో ఆధికారాన్ని వెనక్కి తీసుకుంటోంది. రేపు తేడా వస్తే ఏపీలో అధికారంలో ఉన్నా లేనట్లేనన్న పరిస్థితి వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close