అప్పుడు కేసీఆర్ గుడి కట్టించాడు.. ఇప్పుడు అమ్మేస్తాడట..!

రాజకీయాల్లో ఏదో ఆశించి గుళ్లు కట్టడం కామన్ అయిపోయింది. తాము ఆశించింది ఇవ్వకపోతే ఆ గుళ్లు అమ్ముకునే సీజన్ కూడా వచ్చేసింది. కేసీఆర్ గుడి కట్టి వార్తల్లోకి వచ్చిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ మాజీ టీఆర్ఎస్ నేత ఇప్పుడు ఆ గుడిని విగ్రహంతో సహా అమ్మేస్తానని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన గుండ రవీందర్ తన ఇంటి ముందు గుడి నిర్మించారు. అందులో కేసీఆర్ విగ్రహాన్ని పెట్టి రోజూ పూజలు చేసేవారు.

గుండ రవీందర్ 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సుమారు రూ.3లక్షలు పెట్టి ఆలయం నిర్మించి అందులో కేసీఆర్, జయశంకర్ సార్, తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం పట్టించుకోలేదు. ఆయన మామూలుగా కేబుల్ ఆపరేటర్‌గా ఉన్నారు. తర్వాత దాన్ని కూడా టీఆర్ఎస్ జిల్లాస్థాయి నేతలు లాగేసుకున్నారు. దీంతో ఉపాధి కూడా లేకుండా పోయింది . తనను ఆదుకోవాలని కేసీఆర్‌, కేటీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు.

తర్వాత తను కట్టినగుడి ముందే నిరసన చేశారు. ఓ సారి టవర్ ఎక్కారు. ఎవరూ పట్టించుకోలేదు. చివరికి గుడిలో విగ్రహాలకు ముసుగులు వేసి పూజలు ఆపేసి.. బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరిన తర్వాత ఇక కేసీఆర్ గుడి అవసరం ఏముందనుకున్నారేమో కానీ అమ్మకానికి పెట్టేశారు. ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. కొనేందుకు ముందుకు వస్తున్నారని.. ఎవరూ రాకుంటే కూల్చి వేస్తానని రవీందర్ చెబుతున్నారు. ఈ ఫేస్‌బుక్ పోస్ట్ కింద కామెంట్లలో అనేక మంది తాము కూడా ఉద్యమం కోసం పని చేసామని.. లక్షలు ఖర్చు పెట్టుకున్నామని కానీ తమకూ పదవులు రాలేదని వాపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇండ్ర‌స్ట్రీకి పెద్ద అవ‌స‌రం లేదు:  ద‌ర్శ‌కేంద్రుడి మాట‌

టాలీవుడ్ పెద్ద ఎవ‌రు?   - ఇప్పుడు ఇదే బిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఆ స్థానం చిరంజీవిదే అని ఓ వ‌ర్గం అంటుంటే, మ‌రో వ‌ర్గం మాత్రం `దాసరి లేని లోటు భ‌ర్తీ చేయ‌లేరు`...

స్థానిక ఎన్నికల బూస్ట్.. వైసీపీ ఖాతాలో 11 ఎమ్మెల్సీలు !

స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఆ పార్టీకి మరో రకంగా కలిసి వస్తోంది . స్థానిక సంస్థల కోటాలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ ఆ పార్టీ స్వీప్...

నెల జీతానికి ప‌నిచేసిన ‘బొమ్మ‌రిల్లు’ భాస్క‌ర్‌

గీతా ఆర్ట్స్ ఏం చేసినా - దాని వెనుక ఓ అర్థం ప‌ర‌మార్థం ఉంటాయి. ఎందుకంటే... అల్లుఅర‌వింద్ బుర్ర‌... మామూలు బుర్ర కాదు. అందుకే ఫ్లాపుల్లో ఉన్న `బొమ్మ‌రిల్లు` భాస్క‌ర్‌ని రంగంలోకి దించినా...

రాహుల్ కాదు ప్రియాంకను ప్రమోట్ చేస్తున్న పీకే !

కాంగ్రెస్‌ కోసం పని చేస్తారా.. లేక కాంగ్రెస్‌లో చేరుతారా  అన్నదానిపై సస్పెన్స్ కొనసాగిస్తున్న ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ మెల్లగా రాహుల్ గాంధీని సైడ్ చేసి ప్రియాంకను ప్రమోట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది....

HOT NEWS

[X] Close
[X] Close