కేసీఆర్‌ వ్యూహానికి హైకోర్టులో వ్యతిరేకత!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పీఠాన్ని దక్కించుకునే ప్రయత్నంలో మరీ చిల్లర ఓట్లను కూడా వదులుకోకుండా.. గెలుపు తమది అనిపించుకోవడానికి కేసీఆర్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఒక సర్కారీ కుట్రకు ఇప్పుడు రంగు పడుతోంది. అధికారం తమ చేతిలో ఉన్నది కదాని యథేచ్ఛగా చట్టాల్ని కూడా సవరించేసుకుని.. మేయర్‌ పీఠాన్ని తాము చేజిక్కించుకోవడానికి బాటలు తీర్చుకోవాలనుకుంటే.. ప్రజాస్వామ్యంలోని మిగిలిన వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటాయా? కేసీఆర్‌ సర్కారు కన్నెర్ర చేస్తుందేమోనని భయపడే కొన్ని వ్యవస్థలు ఊరుకోవచ్చు గాక.. కానీ.. సకలవ్యవస్థలూ అలాగే ఉంటాయని అనుకుంటే పొరబాటు. అందుకే కేసీఆర్‌ ప్రభుత్వం పరంగా జరిగిన సర్కారీ కుట్రను తప్పుబట్టేలా హైకోర్టు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం తీర్చిదిద్దుకున్న ‘అడ్డదారి’ని మూసివేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.

సార్వత్రిక ఎన్నికల సమయానికి గ్రేటర్‌హైదరాబాద్‌ పరిధిలో బలం లేని తెలంగాణ రాష్ట్ర సమితి, కార్పొరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకోవడం అనేదానిని లక్ష్యంగా పెట్టుకుంది. ఎంఐఎంను మిత్రపక్షం అంటూ ఏకపక్షంగా కేసీఆర్‌ ప్రకటించినా, సీమాంధ్రులంతా మా బిడ్దలు అంటూ గారాలు కురిపించే ప్రయత్నం చేసినా.. అన్నీ మేయర్‌ పీఠం కోసమే అన్నది స్పష్టం. ఇలాంటి నేపథ్యంలో.. ఎక్స్‌అఫీషియో సభ్యుల ఓట్ల రూపంలో కనీసం కొన్ని ఓట్లనయినా అడ్డదారిలో తమకు అనుకూలంగా ఉండేలా సృష్టించుకోగలిగితే.. మేయర్‌ ఎన్నిక సమయానికి లబ్ధి పొందవచ్చునని తెరాస ప్లాన్‌ చేసింది.

ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేయడానికంటె పూర్వం, గవర్నర్‌ ద్వారా నామినేట్‌ కావడానికంటె పూర్వం గ్రేటర్‌లో ఓటుహక్కు కలిగి ఉన్న వారికి మాత్రమే మేయర్‌ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఓటుహక్కు వస్తుందనేది సాధారణంగా జీహెచ్‌ఎంసీ చట్టంలోని 5(1)ఎ చట్టం చెప్పే సంగతి. అయితే కేసీఆర్‌ సర్కారు దీనిని అడ్డగోలుగా మార్చేసింది. జిల్లాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికలను ఏకపక్షంగా రకరకాల మార్గాల్లో చేజిక్కించుకున్న తెరాస, వారికందరికీ ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఇచ్చేస్తే మేయర్‌ పీఠం తమదైపోతుందని ఆశపడింది. అందుకే చట్టాన్ని తమ ఇష్టానుసారంగా సవరించేసి.. ‘ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత జీహెచ్‌ఎంసీలో ఓటు హక్కు పొందినా వారికి ఎక్స్‌అఫీషియో ఓటు వచ్చేలా మార్చింది’.

ఈ అరాచక నిర్ణయంపై కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో న్యాయస్థానం తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. జీవో ద్వారా చట్టాన్ని మార్చేయడానికి చేసిన ప్రయత్నాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యను కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల చాలా తీవ్రమైన అభిశంసనగా భావించాల్సి ఉంది. అయితే దీనిపై గురువారం కూడా వాదనలు జరుగుతాయి. ఈ జీవోపై కోర్టు ఇవ్వబోయే మధ్యంతర ఉత్తర్వులు.. ప్రభుత్వ జీవోకు వ్యతిరేకంగా ఉంటే గనుక.. తాము సృష్టించుకున్న ‘అడ్డదారి’ కి సంబంధించి.. అడ్డంగా బుక్కయిపోయి, పరువు పోగొట్టుకున్నందుకు కేసీఆర్‌ సర్కారు సిగ్గుపడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close