కేసీఆర్ సర్వీస్ బ్యాచ్‌కు రిటైర్మెంట్ !

తెలంగాణ లో రిటైర్డ్ అధికారులందరికీ నిజంగానే రిటైర్మెంట్ ప్రకటించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో రిటైరయినప్పటికీ తమ పదవుల్లో పాతుకుపోయిన వారు ప్రభుత్వ పెద్దల వద్దకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకుని అదే పదవిలో కొనసాగుతున్నారు. అలాంటి వారిపై దృష్టి పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

రిటైర్ అయిన తర్వాత కూడా సర్వీసుల్లో కొనసాగుతున్న వారి లిస్ట్ పంపాలని అన్ని విభాగాలకు తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పంపాలని అన్ని శాఖలకు ఆదేశించారు. కేసీఆర్ హయాంలో ఇష్టారాజ్యంగా రిటైర్ అయిన ఆఫీసర్లను కొనసాగించిన బీఆర్ఎస్ నేతలు.. తమకు అనుకూలమైన పనులు చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ సరిచేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ననిర్ణయించుకుంది.

ఇలా రిటైర్ అయినా కొనసాగుతున్న వారి వల్ల అనేక మంది అసలైన అర్హులకు అన్యాయం జిగింది. రిటైర్ అయిన వారిని కొనసాగించడం వల్ల అర్హులకు ప్రమోషన్లు రాకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నారు. రిటైరైనా ఇంకా ఉద్యోగంలో ఉన్న వారు వందల మంది ఉంటారని అంచనా ఉంది. ఇలాంటి వారు మొత్తం ఎంతమంది అలాంటి వారు ఉన్నారనేదానిపై బుధవారమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అందర్నీ ఇంటికి పంపనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ష 2: ఇంట్ర‌వెల్ లో ‘జాత‌రే..’

ఈ యేడాది విడుద‌ల అవుతున్న క్రేజీ ప్రాజెక్టుల‌లో 'పుష్ష 2' ఒక‌టి. ఆగ‌స్టు 15న 'పుష్ష 2'ని విడుద‌ల చేయ‌డం కోసం చిత్ర‌బృందం రేయింబ‌వ‌ళ్లూ క‌ష్ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో...

చిరు సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌?

సంక్రాంతికి వ‌చ్చిన సినిమాల్లో 'నా సామిరంగ‌' ఒక‌టి. నాగార్జున స‌ర‌స‌న ఆషికా రంగ‌నాథ్ మెరిసింది. త‌న స్క్రీన్ ప్ర‌జెన్స్ తో ఆక‌ట్టుకొంది. సీరియ‌ర్ హీరోల‌కు ఆషికా మంచి ఛాయిస్ అని.. అంతా అనుకొన్నారు....

రాజాసాబ్‌: సెకండాఫ్‌… స్పెల్‌బౌండ్!

'స‌లార్‌'తో మ‌రో సూప‌ర్ హిట్టు కొట్టాడు ప్ర‌భాస్‌. ఇప్పుడు త‌న దృష్టంతా క‌'ల్కి', 'రాజాసాబ్‌'ల‌పై ఉంది. రెండింటికీ త‌న కాల్షీట్లు పంచుతున్నాడు. రాజాసాబ్ చిన్న చిన్న షెడ్యూల్స్‌తో మెల్ల‌గా పుంజుకొంటోంది. ఈ సినిమాకు...

వైసీపీలో అందరూ చర్చకు సిద్ధమే .. జగన్ రెడ్డి తప్ప !

వైసీపీలో అధినేత జగన్ రెడ్డి తప్ప.. తామంతా పోటుగాళ్లమేనని నిరూపించుకునేందుకు ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతున్నారు. కానీ అసలు జగన్ రెడ్డి మాత్రం చర్చకు వస్తానని చెప్పడం లేదు. తాజాగా అంబటి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close