“బీఆర్ఎస్‌” ఇప్పుడల్లా లేనట్లే !

తెలంగాణ సీఎం కేసీఆర్ మనసు మార్చుకున్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఆయన జాతీయ స్థాయిలో పోరాటానికి సొంత పార్టీ పెట్టాలనే ఆలోచన చేశారు. దాదాపుగా అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీలో పీఆర్వోను పెట్టుకుని ప్రచారాన్ని ఎక్కడిక్కకడ ఘనంగా చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ ప్రకటనే తరువాయి అని అనుకున్నారు కానీ కేసీఆర్ మాత్రం చివరిక్షణంలో ఆగిపోయారు. ఇప్పుడు అలాంటి ఆలోచన పూర్తిగా పక్కన పెట్టేశారని.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే మొదటికే మోసం వస్తుందని ఆయన ఓ అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

కేసీఆర్ చాలా కాలంగా తెర వెనుక రాజకీయాలే చేస్తున్నారు ఇటీవల యశ్వంత్ సిన్హా కు మద్దతుగా నిర్వహించిన సభ తప్ప ఆయన బయట కనిపించలేదు. జాతీయ రాజకీయాలపై సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారని అయితే అదే సమయంలో రాష్ట్రంలో పట్టు కోల్పోతే దేశంలో ఎవరూ పట్టించుకోరన్న కారణంగా ముందు సొంత ఇంటిని చక్క దిద్దుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎంత ధీమాగా ఉన్నా.. టీఆర్ఎస్ పరిస్థితి మరీ అంత మెరుగ్గా ఏమీ లేదని.. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని.. కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలిపోయి తాము గెలుస్తామని టీఆర్ఎస్ వర్గాలు ఇప్పటి వరకూ అంచనా వేస్తున్నాయి. కానీ ప్రజలు మార్పును డిసైడ్ అయితే ఏదో ఓ పార్టీకి గుంపగుత్తగా వేస్తారని ప్రస్తుతం పొలిటికల్ ట్రెండ్స్ చెబుతున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేసీఆర్ ముందుగా.. అధికారాన్ని నిలబెట్టుకోవడంపై దృష్టి సారించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మరో పదిహేను నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ముందస్తుకు వెళ్తే మరో ఆరు నెలల ముందే రావొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ఎన్నిక‌ల్లో జూ.ఎన్టీఆర్ స‌పోర్ట్ ఏ పార్టీకి?

జూ.ఎన్టీఆర్ ఎవ‌రివాడు...? ఏ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు...? ఇదేం ప్ర‌శ్న‌ల‌నే క‌దా మీ డౌట్. నిజ‌మే... చాలా కాలంగా అన్ని పార్టీల‌కు దూరంగా ఉంటూ, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమిత‌మైనా , జూ.ఎన్టీఆర్ పేరు...

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close