ఈ సారి గాల్వన్, పుల్వామా అమరవీరులకు చెక్కులు !

తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఇప్పటికే అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయింది. ఈ సారి కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంది. గాల్వన్ లోయ ఘర్షణలో చనిపోయిన వారికి కేసీఆర్ గతంలో పరిహారం ప్రకటించారు. ఇప్పటికే ఏడు కుటుంబాలకు తలా రూ. 10 లక్షలు ఇచ్చారు. ఇంకా 12 మందికి ఇవ్వాల్సి ఉంది. 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌‌పై జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలకూ ఆర్థిక సాయం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు.

ఈ మేరకు అధికారులు జాబితా రెడీ చేసి కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఈ కుటుంబాలకూ పరిహారం చెక్కులు పంపిణీ చేసే అవకాశం ఉంది. ఎన్నికల సీజన్ ప్రారంభానికి ముందు పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రవాదుల దాడిలో మొత్తం 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఆ సంఘటన రాజకీయంగానూ కలకలం రేపింది. ఈ దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు తలా రూ. 25 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున సాయం అందించనున్నట్లు సీఎం అసెంబ్లీ వేదికగానే హామీ ఇచ్చారు. మూడేళ్ళు దాటినా ఆ సాయం ఇప్పటికీ ఇవ్వలేదు.

అసెంబ్లీలో ప్రకటన చేసిన మేరకు సాయం చేయరా అని అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో కేసీఆర్‌ను ప్రశ్నిస్తూ పోస్టులు కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నందున ఇలాంటి హామీలను బాకీ ఉంచుకోకూడదని.. తక్షణం అమలు చేసేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రకారం.. ఈ సారి అమరవీరుల జవాన్ల కుటుంబాలకు పరిహారం పంపిణీ ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

మ‌హేష్ కోసం రూటు మారుస్తున్న త్రివిక్ర‌మ్‌

త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఎలా ఉంటుంది? కుటుంబం, బంధాలు, అనురాగాలు, ఆప్యాయ‌త‌లు, సెంటిమెంట్.. వీటి మధ్య‌లో హీరోయిజం, పంచ్‌లూ.. ఇవ‌న్నీ ఉంటాయి. త్రివిక్ర‌మ్ సూప‌ర్ హిట్లు అత్తారింటికి దారేది నుంచి... అలా...

‘ప్రాజెక్ట్ కె’… రెండు భాగాలా?

ఈమ‌ధ్య పార్ట్ 2 సంస్క్రృతి బాగా ఎక్కువైంది. బాహుబ‌లి నుంచీ ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. ప్ర‌భాస్ స‌లార్ రెండు భాగాలే. పుష్ప‌, కేజీఎఫ్‌లూ బాహుబ‌లిని అనుస‌రించాయి. ఇప్పుడు కార్తికేయ రెండో భాగం రాబోతోంది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close