మొక్క బ‌త‌క్క‌పోతే ప‌ద‌వి పోతుంద‌న్న కేటీఆర్!

ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం వెన‌క ఎలాంటి రాజ‌కీయ ఉద్దేశాలు లేవ‌న్నారు మంత్రి కేటీఆర్. ఇది ప‌ట్ట‌ణాల‌ను అభివృద్ధి చేయాల‌న్న ల‌క్ష్యంతో మాత్ర‌మే ప్రారంభించింద‌న్నారు. ఇది ఎన్నిక‌ల స‌మ‌యం కానే కాదు, అన్ని ర‌కాల ఎన్నిక‌లూ పూర్త‌యిపోయాయ‌న్నారు. రాబోయే నాలుగేళ్ల‌పాటు ప్ర‌జ‌ల‌కు సేవ చేసుకుని, వారి మ‌న‌సు దోచుకునే ఉద్దేశంతో చేస్తున్నామ‌న్నారు. గ‌తంలో మున్సిపాలిటీలంటే చెడ్డ పేరు ఉండేద‌నీ, అది పూర్తిగా పోవాల‌న్నారు. బ‌ల్దియా అంటే ఖాయా పీయా చ‌ల్దియా అనే అప‌వాదు ఉంద‌నీ, దాన్ని పూర్తిగా మార్చాల‌నేది ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్ష్యం అన్నారు.

ఈ సంద‌ర్భంగా నాయ‌కుల‌కు మ‌రో హెచ్చ‌రిక కూడా చేశారు మంత్రి కేటీఆర్! ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో భాగంగా మున్సిపాలిటీల‌ వార్డుల్లో మొక్క‌లను పెద్ద సంఖ్య‌లో నాయ‌కులు నాటుతున్నారు. ఇది మంచి విష‌య‌మే. వీటిలో క‌నీసం 85 శాతం మొక్క‌లు బ‌తికి తీరాల‌నీ, ఈరోజు ఆడంబ‌రంగా పాతేసి, ఆ త‌రువాత వాటిని ప‌ట్టించుకోకుండా ఉంటే కుద‌ర‌ద‌న్నారు కేటీఆర్. ఇదీ ఓకే! అయితే, మొక్క‌ల బాధ్య‌త‌లు కౌన్సిల‌ర్లు తీసుకోవాల‌నీ, అవి బ‌త‌క్క‌పోతే కౌన్సిల‌ర్ల ప‌ద‌వులు ఊడ‌గొట్ట‌డం ఖాయ‌మ‌న్నారు కేటీఆర్. భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు ఏప్రిల్ 2 నుంచి టీఎస్ బీపాస్ విధానం అమ‌ల్లోకి తెస్తామ‌ని మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా చెప్పారు.

ప‌ద‌వులు ఊడ‌గొడ‌తా అంటూ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యం నుంచే నాయ‌కుల‌కు కేటీఆర్ వార్నింగులు ఇస్తూ వ‌స్తున్నారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి విజ‌య‌వంతం చేయ‌క‌పోతే ప‌ద‌వులు పీకేస్తామ‌ని గ‌త‌వారంలోనే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు… మొక్క‌లు బ‌త‌క్క‌పోతే ప‌ద‌వులు ఊడ‌గొడ‌తామంటున్నారు. కేటీఆర్ ఒక్క‌రే కాదు… మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర రావు కూడా ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి ప్రారంభానికి ముందు రోజు నాయ‌కుల‌తో మాట్లాడుతూ… స‌రిగా పనిచేయ‌క‌పోతే ప‌ద‌వులు పోతాయి జాగ్ర‌త్త అంటూ మాట్లాడారు! ఒక‌సారి చెప్తే చాల‌దా..? ప‌దేప‌దే ప్ర‌తీ అంశంలోనూ ప‌ద‌వులు పీకేస్తామ‌ని బెదిరించాలా..? మొక్క‌లు పెంచాల్సిన బాధ్య‌త‌ను, అవ‌స‌రాన్ని నాయ‌కుల‌కు తెలిసేలా చేయాలిగానీ… ప్ర‌తీదానికీ ప‌ద‌వులు పీకేసుడేనా తార‌క‌ మంత్రం?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్ : ఓనర్లు కాదు.. వాళ్లే టీవీ5ని అమ్మేశారు..!

ప్రముఖ మీడియా సంస్థ టీవీ5 అమ్మేశారని కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఒక్క సారిగా ఓ పార్టీ వాళ్లు ప్రచారం ప్రారంభించేశారు. దీంతో తెలుగు మీడియాలో అందరూ ఉలిక్కిపడ్డారు. నిజమా అని చెక్...

సాగర్‌కు ఓకే కానీ సీమకు కృష్ణా నీళ్లు పంపొద్దంటున్న తెలంగాణ..!

శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతున్నా .. రాయలసీమకు నీరు విడుదల చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టులన్నీ కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లడంతో ఇప్పుడు వారి దగ్గర నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది....

టీ బీజేపీ నుంచి పోయేవాళ్లను ఎవరూ ఆపడం లేదేంటి..!?

తెలంగాణ బీజేపీకి వలసల ఫీవర్ పట్టుకుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అంటూ అంచనాలు రావడంతో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున నేతలు బీజేపీ బాట పట్టారు....

మండలి రద్దు తీర్మానాన్ని ఇంకా పరిశీలిస్తున్నారట..!

శాసనమండలిని రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానం పరిశీలనలో ఉందని.. కేంద్ర మంత్రి రిజుజు రాజ్యసభలో తెలిపారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు.. లిఖితపూర్వక సమాధానం...

HOT NEWS

[X] Close
[X] Close