రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక క‌స‌ర‌త్తులో కేసీఆర్!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ త్వ‌ర‌లో రానుంది. మ‌రో రెండ్రోజుల్లో, అంటే ఈనెల 6 నుంచి నామినేషన్లు ప్రారంభ‌మౌతాయి. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు స్థానాల‌ను తెరాస ఏక‌గ్రీవం చేసుకోవ‌డం లాంఛ‌న‌మే. కావాల్సినంత సంఖ్యాబ‌లం తెరాస‌కు ఉంది. అయితే, ఆ రెండు స్థానాల నుంచి ఎవ‌రిని రాజ్య‌స‌భ‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంపిస్తార‌నే ఉత్కంఠ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. గ‌డ‌చిన రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల ఎంపిక‌పైనే ఆయ‌న స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. 6 నుంచి నామినేష‌న్లు ఉండ‌టం, అదే రోజున అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు మొద‌లుకావ‌డంతో… ఈలోపుగా ఇద్ద‌రి పేర్ల‌ను ఖ‌రారు చేసి, ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెరాస వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ రెండు స్థానాల‌కు ముగ్గురు పేర్లు సీఎం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేశ‌వ‌రావు, దామోద‌ర‌రావు, గ్యాద‌రి బాల‌మ‌ల్లు… ఈ ముగ్గురిలో ఇద్ద‌రికే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రోసారి త‌న‌కు ఛాన్స్ ఇస్తార‌నే ధీమాతో కేశ‌వ‌రావు మొద‌ట్నుంచీ ఉన్నారు. అయితే, ఇప్ప‌టికే ముగ్గ‌ురు బీసీలు రాజ్య‌స‌భ‌కు వెళ్లారు. మ‌రోసారి అదే కోటా అవ‌కాశం ఉంటుందా అనే చ‌ర్చ ఉంది. ఇక, దామోద‌ర్ కి రాజ్య‌స‌భ సీటు ఇస్తాన‌ని కేసీఆర్ ఎప్పుడో హామీ ఇచ్చార‌ట‌. గ‌త‌సారి పంపాల‌నుకున్నా… ఆయ‌న స్థానంలో సంతోష్ కి అవ‌కాశం ద‌క్కింది. కాబ‌ట్టి, ఇప్పుడు కచ్చితంగా ఆయ‌న‌కి అవ‌కాశం ఉండొచ్చు. బాల‌మ‌ల్ల విష‌యానికొస్తే… ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ కి అండ‌గా ఉన్నారు. గ‌తంలోనే ఆయ‌న్నీ రాజ్య‌స‌భ‌కుగానీ, మండ‌లికిగానీ ఎంపిక చేయాల‌ని సీఎం ప్ర‌య‌త్నించినా… సామాజిక స‌మీక‌ర‌ణ‌ల వ‌ల్ల కుద‌ర్లేదు. ఇప్పుడు ఆయ‌న‌కి న్యాయం జ‌రుగుతుంద‌నే ధీమాతో ఆయ‌న ఉన్నారు.

అస‌లైన ఉత్కంఠ ఏంటంటే… కుమార్తె క‌విత‌ను రాజ్య‌స‌భ‌కు పంపిస్తున్నారా లేదా అనేది. క‌విత పేరు ప్ర‌ధానంగా ప‌రిశీల‌న‌లో లేన‌ట్టే అని పార్టీ వ‌ర్గాలు అంటున్నా… చివ‌రి నిమిషంలో కేసీఆర్ నిర్ణ‌యం ఎలా ఉంటుందో తెలీదు. మొద‌ట్నుంచీ రాజ్య‌స‌భ సీటు ఆశిస్తున్న పొంగులేటి పేరు కూడా చివ‌రికి వ‌చ్చేసరికి వినిపించ‌క‌పోవ‌డం విశేషం. ఇవాళ్ల‌, లేదా రేప‌ట్లోగా రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల‌పై కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close