సోనియా గాంధీ నుంచి పాఠం నేర్చుకున్న కేసీఆర్‌…!

సామాన్యులైనా, రాజకీయ నాయకులైనా నిరంతరం పాఠాలు నేర్చుకోవల్సిందే. చిన్నప్పుడు బడిలో పాఠాలు నేర్చుకుంటే పెద్దయ్యాక తమ అనుభవాల నుంచే కాకుండా, వేరేవారి జీవితాల నుంచి, వారి అనుభవాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సొంత అనుభవాల నుంచి, ఇతరుల జీవితాల నుంచి నేర్చుకునే పాఠాలు రాజకీయ నాయకులకు జీవితంలో మరింత ఉన్నతి సాధించడానికో, తమ వారసులను మంచి మార్గంలో పెట్టడానికో, వారికి ప్రయోజనం కలిగించడానికో ఉపయోగపడతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి అలాగే పాఠాలు నేర్చుకుంటున్నారు. కేసీఆర్‌ నేర్చుకునేవి మామూలు పాఠాలు కాదు కదా. ఇవి ‘రాజకీయ పాఠాలు’. ఆయన అపారమైన రాజకీయ అనుభం ఉన్న అపర చాణక్యుడు. ఏ విషయంలోనైనా ఆయన బుర్ర పాదరసంలా పనిచేస్తుంటుంది.

సమకాలీన రాజకీయాలను కూలంకషంగా అధ్యయనం చేసే కేసీఆర్‌ వాటి నుంచి కుటుంబ రాజకీయానికి ఉపయోగపడే పాఠాలు నేర్చుకుంటారు. సమయానుసారం వాటిని ఆచరణలో పెడతారు. ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌’ అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది కదా. తెలంగాణలో ఎంతో పాపులరైన ఓ ఆంగ్ల దినపత్రిక కొంతకాలం కిందట 2020లో కేటీఆర్‌ ముఖ్యమంత్రి పీఠం ఎక్కే అవకాశముందని రాసింది. ఆ కథనానికి ఊతమిచ్చేలా కొన్ని రోజుల నుంచి కొందరు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతాడంటూ మీడియాకు, ఇతర సందర్భాల్లో చెబుతున్నారు. ఇది చూసిన కేటీఆర్‌ తాను ముఖ్యమంత్రి కావడమేమిటని, ఇంకో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉంటానని అసెంబ్లీలో కేసీఆరే చెప్పారని అన్నాడు.

ఈ నేపథ్యంలో ఈరోజు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ‘త్వరలో పట్టాభిషేకం’ అనే శీర్షికతో బ్యానర్‌ కథనం ప్రచురించింది. కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతాడనే ప్రచారానికి ఇది కూడా బలం చేకూర్చింది. కేటీఆర్‌ ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావడం ఖాయమనే సంగతి అందరికీ తెలుసు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినప్పటినుంచే ఆయన తరువాత కేసీఆరే సీఎం అనే విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ కలగన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదని అంచనా వేశారు. అలాంటప్పుడు తాను కేంద్రంలో చక్రం తిప్పవచ్చనుకున్నారు. ఆయన ఆశించింది జరిగివుంటే కేటీఆర్‌ అప్పుడే ముఖ్యమంత్రి అయ్యేవాడు.

కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక కుమారుడికి మంత్రి పదవి ఇవ్వకుండా పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను చేసి ఆయన సామర్ధ్యాన్ని పరీక్షించారు. సో…కేటీఆర్‌ ఇటు మంత్రిగా, అటు పార్టీ సారథిగా, వ్యూహకర్తగా వంద మార్కులతో పాసైపోయాడు. కాబట్టి పట్టాభిషేకం చేయడమే మంచిదని నిర్ణయించుకున్నారేమో. ఇప్పటికిప్పుడు కేసీఆర్‌కు వచ్చిన ఢోకా ఏమీలేదు. పార్టీలోనూ, రాష్ట్రంలోనూ ఆయనకు తిరుగులేదు. కాని కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలనేది ఆయన కల, కోరిక, లక్ష్యం. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ ప్రభ పూర్తిగా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారేమో.

ఎందుకంటే ఈమధ్య కాలంలో జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చతికిల పడింది. అలాగే సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీ పట్ల దేశమంతా వ్యతిరేకత పెల్లుబుకుతోంది. కాబట్టి తాను ఫెడరల్‌ ఫ్రంట్‌ కలను బయటకు తీసి వర్క్‌ చేయాలనుకుంటున్నారేమో…! బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తే తాను స్వేచ్ఛగా దేశమంతా తిరగొచ్చు. వచ్చే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి వస్తుందేమో…! ఈ రెండూ కాకపోతే ఆరోగ్య కారణాలు కావచ్చు. మరి ఆయన ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు. కేసీఆర్‌ తన సన్నిహితుల వద్ద కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన ఘోర తప్పిదాన్ని తెలియచేసినట్లు ఆంధ్రజ్యోతి రాసింది.

నిజానికి కొందరు విశ్లేషకులు, సామాన్య జనం కూడా దీన్ని గురించి మాట్లాడుకున్నారు. అదేమిటంటే…యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాహుల్‌ గాంధీని మంత్రిని చేసివుండాల్సింది. కాంగ్రెసు అదృష్టంకొద్దీ రెండోసారి కూడా యూపీఏ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాహుల్‌ని ప్రధానిని చేసుండొచ్చు. అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి రాహుల్‌ని ప్రధానిగా చేయడానికి కష్టపడాల్సివచ్చేది. ఆనాడు సోనియా ఆ పని చేయకపోవడంవల్ల రాహుల్‌ నష్టపోయాడని కేసీఆర్‌ అభిప్రాయం. భవిష్యత్తులో ఆయన గ్యారంటీగా ప్రధాని అవుతాడని చెప్పలేం. కేటీఆర్‌ను ఇప్పుడు ముఖ్యమంత్రిని చేయకపోతే రాహుల్‌ మాదిరిగా అయిపోతాడని కేసీఆర్‌ భావిస్తున్నారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్...

చిరంజీవి ని కలవడం పై వివరణ ఇచ్చిన సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా ఈరోజు అధికారికంగా పగ్గాలు చేపట్టారు సోము వీర్రాజు. పార్టీని 2024లో అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూండగా, ఇటీవల చిరంజీవిని...

జగన్ “స్టే” ఆశల్ని వమ్ము చేసిన తప్పుల పిటిషన్..!

మూడు రాజధానుల బిల్లుల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై స్టే తెచ్చుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కాలం కలసి రావట్లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న ఏపీ ప్రభుత్వ న్యాయ నిపుణులు తప్పుల తడకలుగా వేయడంతో.....

మాకు మహానగరాల్లేవ్.. సాయం చేయండి : జగన్

కేంద్రం నుంచి సాయం పొందాలంటే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసే విజ్ఞప్తులు కాస్త భిన్నంగా ఉంటాయి. కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతున్న పది రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ వీడియో...

HOT NEWS

[X] Close
[X] Close