చిరు సినిమాలో కీర్తి సురేష్‌?

`ఆచార్య‌` త‌ర‌వాత ఏ సినిమా చేయాల‌న్న విష‌యంలో చిరంజీవి పూర్తి క్లారిటీతో ఉన్నాడు. `ఆచార్య‌` త‌ర‌వాత‌ `వేదాళం` రీమేక్ నే ప‌ట్టాలెక్క‌బోతోంది. మెహ‌ర్ ర‌మేష్ పూర్తి స్క్రిప్టుతో సిద్ధంగా ఉండ‌డంతో – చిరు కి కూడా ఫుల్ క్లారిటీ వ‌చ్చేసింది. ఓవైపు.. న‌టీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణుల ఎంపిక ప్ర‌క్రియ జోరుగా సాగుతోంది. చిరు చెల్లాయిగా సాయిప‌ల్ల‌వి న‌టిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. సాయి ప‌ల్ల‌వి అయితే ఈ పాత్ర‌కు బాగుంటుంద‌ని చిరు, మెహ‌ర్ ర‌మేష్ భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మ‌రో ఆప్ష‌న్ కూడా చేతిలో ఉంది. త‌నే కీర్తి సురేష్‌. ఈ సినిమాలో న‌టించ‌డానికి కీర్తి కూడా ఉత్సాహం చూపిస్తోంద‌ని తెలుస్తోంది. సాయి ప‌ల్ల‌వి, కీర్తి సురేష్‌ల‌లో బెట‌ర్ ఆప్ష‌న్ ఏది అనే విష‌యంలో చిత్ర‌బృందం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంది. ఎవ‌రైనా ఓకే. కాక‌పోతే.. కాల్షీట్ల స‌ర్దుబాటు చూసుకోవాల్సివుంటుంది. చిరంజీవి ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో లేరు. ఆయ‌న రాగానే… మెహ‌ర్ ర‌మేష్ తో ఓ మీటింగ్ ఉండ‌బోతోంది. ఆ త‌ర‌వాతే.. చిరు చెల్లాయిగా ఎవ‌ర‌న్న‌ది తేలుతుంది. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రొచ్చినా… బాగానే ఉంటుంది మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close