కీర్తి సురేశ్‌కు కొన్నాళ్ళుగా విజయాలు లేవు. సినిమాలు కూడా తగ్గాయి. లేడి ఓరియంటెడ్ సినిమాలు కూడా కలసిరావడం లేదు. తాజాగా రివాల్వర్ రీటా అనే క్రైమ్ కామెడీతో వచ్చింది. అసలు ఈ సినిమాకి ప్రమోషన్స్ లేవు. ఈ సినిమా ఒకటుందని పెద్దగా తెలీదు. ఆ ఎఫెక్ట్ షోలపై పడింది. జనం లేకపోవడంతో చాలా చోట్ల ఉదయం షోలు క్యాన్సిల్ చేశారు.
సినిమా చూసిన జనం కూడా పెదవి విరిచారు. ఈ క్రైమ్ కామెడీలో కథ, కథనాలు సరిగ్గా కుదరలేదు. విషయం లేని కథ, థ్రిల్ ఇవ్వని స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల సహనానికి సినిమా పరీక్షగా మారింది. అటు తమిళ్ లో కూడా సినిమాకి సరైన రెస్పాన్స్ లేదు. నిజానికి కీర్తి నటన విషయంలో మంచి మార్కులు పడతాయి. ఈ సినిమాలో అదీ జరగలేదు. సినిమా మొత్తం ఒకే ఎక్స్ప్రెషన్లో కనిపించేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మొత్తనికి రివాల్వర్ రీటా అన్ని విధాలుగా మిస్ ఫైర్ అయ్యింది.