కీర‌వాణి త‌న‌యుడి ‘భాగ్ సాలే’

కీర‌వాణి ఇద్ద‌రు త‌న‌యులూ చిత్ర‌సీమ‌లోనే ఉన్నారు. కాల‌భైర‌వ సంగీత ద‌ర్శ‌కుడిగా రాణిస్తున్నాడు. శ్రీ సింహా `మ‌త్తువ‌ద‌ల‌రా` సినిమాతో హీరో అవ‌తారం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శ్రీ‌సింహ మ‌రో సినిమాని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. అదే.. `భాగ్ సాలే`. మ‌హేష్ బాబు `బిజినెస్ మేన్‌`లో.. `భాగ్ సాలే.. `అనే గీతం ఉంది. ఇప్పుడు ఆ ప‌దం టైటిల్ అయిపోయింది. ప్ర‌ణీత్ బ్ర‌మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సురేష్ బాబు ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడు. కాల భైర‌వ సంగీతం అందిస్తున్నాడు. `మ‌త్తువ‌ద‌ల‌రా` టైపులోనే క్రైమ్ కామెడీ జోన‌ర్‌లో సాగే సినిమా అని ద‌ర్శ‌క నిర్మాత‌లు చెబుతున్నారు. ఈ రోజు శ్రీ సింహా పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. త్వ‌ర‌లోనే ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు ప్ర‌క‌టిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్‌ను బుక్ చేయడానికి రేవంత్ రెడీ..! సంజయ్ సిద్ధమేనా..?

కేసీఆర్ ఎంపీగా పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని.. ఆ విషయాలను తాను బయటపెడతానని బండి సంజయ్ బెదిరించారు. స్పీకర్ పర్మిషన్ తీసుకున్నానని.. తప్ప సరిగా పార్లమెంట్‌ను కుదిపేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే బండి సంజయ్...

కొన్ని చోట్ల మళ్లీ మున్సిపల్ నామినేషన్లు..!

దౌర్జన్యాలు, బలవంతపు ఉపసంహరణలు జరిగాయని ఆరోపణలు వచ్చిన చోట మరోసారి నామినేషన్లకు ఎస్‌ఈసీ అవకాశం కల్పించారు. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి కార్పొరేషన్‌, పుంగనూరు, రాయచోటి పురపాలక సంఘాలు,...

బాలికను పెళ్లి చేసుకుంటావా? విచారణలో రేపిస్ట్‌ను అడిగిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్..!

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే మైనర్‌పై అత్యాచారం చేసిన ప్రభుత్వ ఉద్యోగి కేసు విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. మైనర్‌పై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా...

జనసేనతో మాకు ఎలాంటి పొత్తు లేదు: బీజేపీ నేత డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఒక టీవీ డిబేట్ లో మాట్లాడుతూ తమ పార్టీకి జనసేనతో ఎటువంటి పొత్తు లేదని , ఉండబోదని వ్యాఖ్యానించడం ప్రస్తుతం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళితే.. బీజేపీ...

HOT NEWS

[X] Close
[X] Close