వీడు మామూలోడు కాదు..! ఏకంగా లంచం కోటి..!

అవినీతిని అరికట్టేందుకు రూ. 2వేల నోట్లను కేంద్రం నియంత్రించేసింది కానీ.. అదేమీ ఈ తరహా సంపాదనకు అలవాటు పడిన వారికి అడ్డం కాలేదు. రూ. 2వేల నోట్లు కాకపోతే.. రూ. ఐదు వందల నోట్లు తీసుకురా అంటున్నారు.. గోదాల్లో తెస్తావో.. ట్రక్కుల్లో తెస్తావో నీ ఇష్టం అనే చాయిస్ ఇస్తున్నారు. ఇలా ఓ అధికారి.. రూ. కోటి పది లక్షల లంచాన్ని .. అదీ కూడా అచ్చంగా నోట్ల రూపంలో ఉన్న లంచాన్ని తీసుకుంటూ పట్టుబడిన ఘటన హైదరాబాద్ శివారులోని కీసరలో చోటు చేసుకుంది.

ఎమ్మార్వో జారీ చేసే క్యాస్ట్, ఇన్కం సర్టిఫికెట్లకు ఓ వెయ్యే.. రెండు వేలో లంచం తీసుకుంటారు. కీసర ఎమ్మార్వో మాత్రం.. అలాంటి వాటి జోలికి వెళ్లనే వెళ్లరు. ఆయన రేంజ్ ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఓ భూవివాదాన్ని సెటిల్ చేసేందుకు రూ. కోటి పది లక్షల లంచం తీసుకునేందుకు బేరం మాట్లాడుకున్నాడు. ఆయన రెండు కోట్లు అడిగాడు.. కానీ కరోనా టైంలో అంత కష్టం అని.. 90 లక్షలు డిస్కౌంట్‌కు మాట్లాడుకున్నాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఆ డబ్బుల్ని… గోతాల్లో కుక్కి.. కారులో వేసుకుని తీసుకొచ్చి నాగరాజు ఇంట్లో ఇచ్చాడు. ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు దాడి చేయడంతో.. మొత్తం గుట్టురట్టయింది. ఆ గోతాల్లోని డబ్బుని అలా పరిచి చూపించడానికి ప్రయత్నిస్తే ఇల్లంతా పట్టేసింది. కొసమెరుపేమిటంటే… ఆ ఇంట్లో సోదాలు చేస్తే.. మరో రూ. పాతిక లక్షలు దొరికాయి.

కీస‌ర ఎమ్మార్వో పరిధఇలోని రాంపల్లి లో 28 ఎకరాల ల్యాండ్ వివాదంలో ఉంది. ఆ స్థలాన్ని క్లియర్ చేసి.. కొనుగోలు చేసేందుకు ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ముందుకొచ్చింది. దానికి ఓ ప్రముఖ నేత అనుచరుడు మధ్యవర్తిత్వం వహించాడు. మొత్తంగా డీల్ సెట్ చేసుకుని… మొత్తం అయిపోయిందనుకునే సమయంలో దొరికిపోయారు. ఇప్పుడా ప్రముఖ నేత అనుచరుడు చక్రం తిప్పుతాడు. ఆ నేత కనుసన్నల్లోనే ఇది జరిగి ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. దొరికినా సరే నాగరాజు చాలా దిలాసాగా ఉన్నాడు. తానే ఏసీబీ అధికారినన్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చాడు.

ఈ నాగరాజు బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు. గతంలోనే పెద్ద ఎత్తున అక్రమస్తులతో పట్టుబడ్డాడు. ఆయన ఇంట్లో ఆస్తుల పత్రాలు.. విదేశీ మద్యం బాటిళ్లు దొరికాయి. కానీ ఆ కేసు ఏమయిందో కానీ మళ్లీ ల్యాండ్ డీల్స్ ఎక్కువగా జరిగే కీసరలోనే పోస్టింగ్ తెచ్చుకున్నారు. మళ్లీ వేట ప్రారంభించారు. మళ్లీ దొరికాడు. కానీ మళ్లీ.. పోస్టింగ్ తెచ్చుకోవడానికి పెద్ద సమయం పట్టదనేది అందరికీ తెలిసిన విషయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్లో రీ రీలీజ్‌కి సిద్ధ‌మేనా?

అన్ లాక్ 5లో భాగంగా థియేట‌ర్లు తెర‌చుకుంటాయ‌న్న ఆశాభావంలో ఉంది చిత్ర‌సీమ‌. క‌నీసం 50 శాతం ఆక్యుపెన్సీ విధానంలో అయినా థియేట‌ర్ల‌కు అనుమ‌తులు ఇవ్వొచ్చ‌న్న అంచ‌నాలు ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి కాక‌పోయినా...

అక్టోబ‌ర్ 2: డ‌బుల్ బొనాంజా

ఒకేరోజు రెండు సినిమాలు వ‌స్తే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌.. ఒక సినిమా విడుద‌ల కావ‌డ‌మే అద్భుతం అన్న‌ట్టు త‌యారైంది. అయితే ఈసారి ఓకేరోజు రెండు సినిమాలు ఓటీటీ...

ఈపీఎస్, ఓపీఎస్ మధ్యలో శశికళ..!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయం జోరందుకుంటోంది. ముఖ్యంగా నాయకత్వ సమస్యతో ఉన్న అధికార పార్టీ అన్నాడీఎంకే ఇది మరీ ఎక్కువగాఉంది. ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి.. ఉపముఖ్యమంమత్రి ఈ.పన్నీర్ సెల్వం మధ్య...

అమరావతికి ముంపు లేదని మరోసారి సర్టిఫికెట్ వచ్చేసిందా..!?

రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలో ఉందని గతంలో హరిత ట్రిబ్యునల్ లో కేసులు వేశారు. దీంతో ముంపు నివారించే పధకం రూపొందించాకే రాజధాని నిర్మాణం పై ముందుకు వెళ్లాలని హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది....

HOT NEWS

[X] Close
[X] Close