మోడీకి ప్రత్యామ్నాయ నేత ఇమేజ్ కోసం కేజ్రీవాల్ ప్రయత్నాలు..!

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో సాధించిన అనితర సాధ్యమైన విజయాన్ని సాధించిన తర్వాత మోడీకి ప్రత్యామ్నాయ నేతగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీలోకి చేరికల్ని ఆహ్వానిస్తున్నారు. 24 గంటల్లోనే ఆప్‌లో 11 లక్షల మంది చేరారు. మిస్డ్‌కాల్‌ ఇస్తే పార్టీలో చేరినట్లేనని ఆప్‌ ప్రకటించింది. దీంతో ఆప్‌కు దేశవ్యాప్తంగా భారీ స్పందన వస్తోంది. క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీ కావడం… కేజ్రీవాల్ కు దేశవ్యాప్త గుర్తింపు రావడంతో.. మోడీ, షాలను ఢీకొట్టి సాధించిన విజయం కారణంగా.. ఆప్‌కు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. మూడో సారి గెలిచిన తర్వాత కేజ్రీవాల్ తన ఆలోచనలను మరింతగా పదును పెడుతున్నారు. గెలిచిన తర్వాత కేజ్రీవాల్ ప్రకటనలతోనే ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టే ఆలోచన ఉన్నట్లు కేజ్రీవాల్ చెప్పకనే చెప్పారు.

గతంలో హరియాణా, పంజాబ్, గోవా రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎలాంటి అనుకూలం ఫలితాన్ని అందుకోలేకపోయింది. అప్పటి పరిస్థితి వేరు. ప్రస్తుత పరిస్థితి వేరు. మూడో సారి విజయంతో కేజ్రీవాల్‌కు క్రేజ్ పెరిగింది. ఎనిమిది నెలల తర్వాత జరిగే బిహార్ ఎన్నికలపై ఆప్ దృష్టి పెట్టే అవకాశం ఉంది. జేడీయూ నుంచి బైటకు వచ్చిన కొందరు నేతలు ఆప్‌తో చేతులు కలిపినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదంటున్నారు. కాంగ్రెస్ కూడా పాత తప్పిదాలను పక్కన పెట్టి ఆప్‌ను తమ కూటమిలోకి ఆహ్వానించే అవకాశం ఉంది. అదే జరిగితే ఢిల్లీ వెలుపల కూడా ఆప్ ప్రాబల్యం పెరుగుతుంది.

పైగా సెక్యులర్ శక్తులన్నీ ఒకటి కావాలని బీజేపీ వ్యతిరేకులు పిలుపునివ్వడం కూడా కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. పంజాబ్‌లో ఆప్ మొదట్లో బలమైన పార్టీ. ఆ తర్వాత పరాజయాలతో చిక్కిపోయింది. కానీ ఇప్పుడూ.. పంజాబ్, హర్యానాల్లో ఆప్ హవా ప్రారంభమైంది. దక్షిణాది కూడా.. విస్తరించి… మోడీకి ప్రత్యామ్నాయ నేతగా ఎదగాలన్న లక్ష్యంతో.. కేజ్రీవాల్ ఉన్నారు. ఆ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close