కేర‌ళ‌లో తీసిన సీన్లు.. చెత్త‌బుట్ట‌లోకేనా సుక్కూ,..?

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 15 నుంచి న‌ల్ల‌మ‌ల్ల‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇది వ‌ర‌కే.. కేర‌ళ‌లో కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించారు. అయితే అప్పుడు బ‌న్నీ సెట్లో లేడు. బ‌న్నీతో సంబంధం లేని కొన్ని స‌న్నివేశాల్ని ఈ సినిమా కోసం షూట్ చేశారు. అయితే ఇప్పుడు ఆ స‌న్నివేశాల‌న్నీ పక్క‌న పెట్టేశార్ట‌. కేర‌ళ‌ల‌లో తెర‌కెక్కించిన సీన్లేవీ ఈ సినిమాలో ఉండ‌వ‌ని స‌మాచారం. అవ‌న్నీ ట్రైల్ షూట్ కోసం తెర‌కెక్కించిన సీన్ల‌ని, ఇప్పుడు అవే స‌న్నివేశాల్ని న‌ల్ల‌మ‌ల్ల అడ‌వుల్లో చిత్రీక‌రిస్తార‌ని తెలుస్తోంది. అంటే కేర‌ళ షెడ్యూల్ మొత్తం బుట్ట‌ద‌ఖ‌లు అయిన‌ట్టే అన్న‌మాట‌.

కాక‌పోతే.. కొన్ని సినిమాల‌కు సంబంధించి, మ‌రీ ముఖ్యంగా అట‌వీ నేప‌థ్యంలో సాగే క‌థ‌ల‌కు సంబంధించి… చిత్రీక‌ర‌ణ‌లో కొన్ని సందేహాలుంటాయి. ద‌ట్ట‌మైన అడ‌వుల‌లో, కొండ‌ల మ‌ధ్య షూటింగ్ చేస్తున్న‌ప్పుడు ఎలాంటి వాతావ‌ర‌ణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, అక్క‌డ ప్ర‌తికూల అంశాలేంటి? అనే విష‌యాల్ని చిత్ర‌బృందం ముందే తెలుసుకోవాల‌నుకుంటుంది. అందులో భాగంగానే రెక్కీ షూట్ నిర్వ‌హించార‌ని స‌మాచారం. అందుకోసం దాదాపు ఏడు రోజులు చిత్ర‌బృందం క‌ష్ట‌ప‌డింది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో న‌డిచే క‌థ ఇది. బ‌న్నీ ఓ లారీ డ్రైవ‌ర్ గా న‌టించ‌నున్నాడు. ర‌ష్మిక క‌థానాయిక‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్కే పలుకు : తప్పు జగన్‌ది కాదు..అధికారులది..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారా..? కొన్ని నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూండటంతో ...ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటున్నారా..?. ఇప్పటి వరకూ.. ఏ విషయంలోనూ ప్రజలకు, ప్రతిపక్షాలకు ఇలాంటి సూచనలు...

పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న మూడు డీఏల చెల్లింపునకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. డీఏల చెల్లింపునకు కార్యాచరణ కూడా ప్రభుత్వం ప్రకటించింది. జులై 2018...

ఎన్నికలు నిర్వహణ వద్దంటున్న వైకాపా

దేశంలో కరోనా లాక్ డౌన్ విధించినప్పుడు ఎన్నికలు వాయిదా వేశారని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కులం పేరు పెట్టి మరీ బూతులు తిట్టిన మంత్రులు ఇప్పుడు.. అదే రమేష్ కుమార్ ఎన్నికలు పెడతానంటే...

అమరావతిలో “రియల్ పెయిడ్ ఉద్యమం” స్టార్ట్..!

అమరావతిలో పోటీ ఉద్యమాలు జరుగుతున్నాయి. భూములిచ్చిన రైతులు లాఠీదెబ్బలకు ఓర్చుకుని పోరాటం చేస్తూంటే.. వారికి పోటీగా కొంత మంది ఇప్పుడు ఉద్యమాలను ప్రారంభిస్తున్నారు. శంకుస్థాపన చేసి ఐదేళ్లయిన సందర్భంగా రైతుల సభ...

HOT NEWS

[X] Close
[X] Close