ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎక్కువ ఫోకస్ పెట్టారు కేశినేని నాని. ఈ స్కామ్ తో ఎంపీ చిన్నికి సంబంధం ఉందని ఆరోపిస్తున్న ఆయన తాజాగా ఈడీకి లేఖ రాశారు. చిన్నికి లిక్కర్ స్కామ్ తో సంబంధం ఉందని, దాన్ని తేల్చాలని లేఖలో పేర్కొన్నారు.
ఈ స్కామ్ తో కేశినేని చిన్నికి సంబంధం ఉందా లేదా అనేది దర్యాప్తు సంస్థలు తేల్చుతాయి. మొదట ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్నది తేలితే, నాని ఆరోపిస్తున్నట్టుగా కేశినేని చిన్ని హస్తం ఉంటే త్వరగా బయటపడుతుంది. చిన్నిపై ఆయన చేస్తున్న పోరాటంలో గెలుస్తారు. కానీ కేశినేని నాని ఆ పని చేయకుండా పర్సన్ టార్గెట్ గా ఈడీకి లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది.
ఈ స్కామ్ బిగ్ బాస్ జగన్ అని అన్ని వేళ్ళు అటువైపు చూపిస్తున్నాయి. ఆయనను విచారణకు పిలిస్తే ఏం జరుగుతుందో ఎవరో అయినా ఇట్టే అంచనా వేయగలరు. నిండా మునిగాక చలి ఏముందని భావించి, నిజంగా ఈ స్కామ్ తో సంబంధం ఉంటే టీడీపీ ఎంపీ పేరును జగన్ చెప్పకుండా ఉంటారా? ఒకవేళ ఆయన నోరు తెరవకపోయినా నిందితులైన వైసీపీ నేతలు చెప్పకుండా ఉంటారా? చెప్పేతీరుతారు.
అందుకే కేశినేని నాని ఈ కేసులో ముందుగా బిగ్ బాస్ ఎవరనేది తేల్చాలని ఈడీకి లేఖ రాస్తే..చిన్నిపై ఆయన చేస్తోన్న పోరాటానికి విశ్వసనీయత ఏర్పడేది. ఇప్పటి వరకు వైసీపీ డైరెక్షన్ లో రాజకీయం చేస్తున్నారనే మరకలను తుడుచుకునేవారు. కానీ, ఆయన అందరి అనుమానాలను నిజం చేస్తూ పర్సన్ టార్గెట్ గా రాజకీయం చేస్తుండటం ఈ అనుమానాలను నిజం చేస్తోంది.
దీంతో నాని బిగ్ బాస్ డైరెక్షన్ లో సాగుతున్నారనెందుకు ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.