మళ్లీ వస్తే అమరావతిలో విధ్వంసం చేసి తీరుతామని వైసీపీ నేతలు సిగ్గు లేకుండా ప్రకటించుకుటున్నారు. చంద్రబాబు నాయుడు ఏఐ, క్వాంటమ్ వ్యాలీ అని అంటున్నారని.. తాము వస్తే చేపల చెరువులు తవ్వించి అక్వా వ్యాలీ చేస్తామని .. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రకటించారు. వైసీపీ ఆఫీసులోనే మీడియాతో మాట్లాడిన ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ స్క్రిప్ట్ ఇచ్చారేమో కానీ.. ఏ మాత్రం సిగ్గుపడకుండా చెప్పేశారు.
క్వాంటమ్ వ్యాలీ గురించి ప్రపంచం అంతా చర్చించుకుంటున్న సమయంలో..సీఎం చంద్రబాబు.. కేంద్రం ప్రకటించిన నేషనల్ క్వాంటమ్ మిషన్ ను ఉపయోగించుకుని అమరావతిని కేంద్రంగా చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలను తీసుకు వచ్చి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభిస్తూంటే.. వైసీపీ నేతలు తమ ఫిష్ ఆంధ్రా తెలివి తేటల్ని బయటకు తెస్తున్నారు. తమ బుర్ర లేని తనానికి ఉండే ఫ్యాన్స్ ఉంటారని.. వారిని రంజింప చేయడానికి తప్పదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
గతంలో జగన్ మోహన్ రెడ్డి పులివెందులకు ఫిష్ ఆంధ్రా స్టాల్ ఓపెన్ చేసి.. పులివెందుల ప్రజలు ఇంత ఫ్రెష్ .. చేపలు, రొయ్యలు తింటారని ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు. ఆయన మైండ్ సెట్ చూసి చాలా మందికి అప్పుడే మైండ్ బ్లాంక్ అయింది. ఇప్పుడు ఆయన అనుచరులు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే మాట చెబుతున్నారు. అసలు క్వాంటమ్ వ్యాలీకి.. అక్వా వ్యాలీకి ఎలా పోలిక పెట్టాలని అనిపించిందో కానీ… వారి ట్రాక్ రికార్డును మరోసారి గుర్తు చేసి భయపడేలా చేశాడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.