వైసీపీ నేతలు తాము చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి.. జగన్ రెడ్డి నిర్వాకాలను సమర్థించడానికి విచిత్రమైన వాదనలు తెస్తూంటారు. ఎదుటివారు నవ్వకుంటారన్న ఆలోచన కూడా వారికి ఉండదు. మిథున్ రెడ్డిని జైలులో పరామర్శించడానికి వెళ్లిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి.. జైలు ముందు తానేదో పెద్ద సైటైరిస్టును అన్నట్లుగా మాట్లాడారు. సోషల్ మీడియా స్టార్ గా ఆయనకు ఉన్న పేరుకు ఏ మాత్రం తగ్గకుండా..తాను గొప్పగా చెప్పానని కవర్ చేసుకున్నారు. జగన్ రెడ్డి ఆగస్టు 15వ తేదీన ఎందుకు జెండా వందనం చేయలేదంటే.. అలా చేస్తేనే దశభక్తా అని ఎదురు ప్రశ్నించాడు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజు జెండా వందనం చేయకపోవడం ఖచ్చితంగా దేశభక్తి కాదు. ఆయన చేయలేని పరిస్థితుల్లో కూడా లేడు. రాజకీయాల్లో ఉన్నప్పుడు .. రాజ్యాంగాన్ని సమున్నతంగా గౌరవిస్తున్నప్పుడు.. బారత స్వాతంత్య్రాన్ని విశ్వసించినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఓ సానుకూల సందేశం పంపారు. ఆ మేరకు స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి వాటిని ఆచరించాలి. అంతే కానీ..తాను సీఎంగా లేను కాబట్టి జెండా ఎగరేయను.. అంటే.. అది గౌరవించడం కాదు.. అవమానించడం అవుతుంది. దేశభక్తి లేకపోవడం అవుతుంది.
తాము చేసిన పనుల్ని సమర్థించుకోవడానికి..ఏం..తప్పా అని అడ్డగోలు వాదనలు వినిపిస్తూ ఉంటారు వైసీపీ నేతలు. బొత్స దగ్గర నుంచి అందరూ అంతే. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా అంతే. తాము గొప్పగా చెబుతున్నామని వారు అనుకుంటారేమో.. ఆ సమాధానాల వల్ల వారు ప్రజల్లో మరింత చులకన అవుతున్నామన్న సంగతిని మాత్రం మర్చిపోతున్నారు.