రామ్‌చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకొన్న ‘ధృవ’ డిసెంబరు 9న రాబోతోంది. ఇది వరకు ఈ సినిమాపై ఏమైనా అనుమానాలుంటే.. అవన్నీ ధృవ ట్రైలర్‌తో పటాపంచలు అయిపోయాయి. ఈ సినిమాని ఎంత స్టైలీష్ గా, ఎంత రిచ్‌గా తీర్చిదిద్దారో ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. ట్రైలర్ వచ్చాక చరణ్ కే కాదు, మెగా ఫ్యాన్స్‌కీ కాన్ఫిడెన్స్ లెవెల్స్పెరిగాయి. ఈ క్రేజ్‌ని చరణ్ మరింత క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు. మెల్లమెల్లగా ధృవ ప్రమోషన్లు పెంచడానికి కసరత్తు చేస్తున్నాడు. ఇప్పుడు ధృవతో మరో షాక్ ఇవ్వబోతున్నాడు చరణ్. ధృవ సినిమాలో ఖైదీ నెం.150 మేకింగ్ వీడియోల్ని చూపించడానికి రెడీ అవుతున్నార్ట. సాధారణంగా పెద్ద సినిమాల విడుదల అవుతున్నప్పుడు ఇంట్రవెల్ సమయంలో కొత్త సినిమాల ట్రైలర్లు, టీజర్లు చూపించడం మామూలే. ధృవకైతే ఖైదీ నెం.150 మేకింగ్ వీడియో చూపించాలని డిసైడ్ అయినట్టు టాక్.
వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఖైదీ నెం.150 టీజర్‌ని ధృవ సినిమాతో పాటు చూపించాలని చిరంజీవి భావించాడు. అయితే మరీ ముందుగా రిలీజ్ చేసినట్టు అవుతుందని… ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టినట్టు సమాచారం. డిసెంబరు మూడో వారంలో ఖైదీ నెం.150 పాటల్ని విడుదల చేయనున్నారు. అంతకంటే రెండు రోజుల ముందు టీజర్‌ని చూపించాలని చిత్రబృందం నిర్ణయం తీసుకొందని సమాచారం. సో.. చిరు మేకింగ్ వీడియో ధృవ సినిమాకి స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ కానున్నదన్నమాట.