తొమ్మిదేళ్ళ నిరీక్షణ ఫలించింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెగా 150 వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ బొమ్మ పడిపోయింది. టాక్ ని కాస్త పక్కన పెడితే.. సినిమాతో ”బాసు నీలో తగ్గలేదు గ్రేసు” అని నిరూపించుకున్నారు మెగాస్టార్. అభిమానులకు తెగ నచ్చేసే సినిమా ఖైదీ నెంబర్ 150. చిరంజీవి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారిప్పుడు. మెగాస్టార్ లోని ఎనర్జీ, రిధమ్, పంచ్ పవర్, యాక్షన్, గ్రేస్, టైమింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇంకా చెప్పాలంటే.. అసలు మెగాస్టార్ తొమ్మిదేళ్ళు గ్యాప్ తీసుకున్నట్లు కనిపించలేదు. శంకర్ దాదా జిందాబాద్ తర్వాతే అదే ఏడాది వచ్చినట్లుగా వుందీ సినిమా. అంత గ్లామసర్ గా వున్నారు మెగాస్టార్.
నిజంగా అభిమానులు తననుండి ఏం ఆశిస్తున్నారో మెగాస్టార్ కి బాగా తెలుసు. అందుకే వారి అభిరుచికి తగ్గట్టు తనని తాను మలుచుకున్నారు. అభిమానులు ఏ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు. పండగ భోజనంలా అన్నీ వడించేశారు. ఆయన యాక్షన్ అదుర్స్. కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులోనూ అదరగొట్టేశారు. ఇక డ్యాన్సులు.. తన మార్క్ చూపించారు మెగాస్టార్. తనదైన స్టయిల్ లో చాలా అందంగా అనిపించాయి ఆయన వేసిన స్టెప్స్. మరీ బ్రేకులు, సిగ్నేచర్ స్టెప్స్ లేవు కానీ, తనశైలిలో ఉర్రూతలూగించారు. మొత్తమ్మీద తనవరకూ ప్రేక్షకులతో మెగా హిట్ పించుకున్నారు చిరంజీవి.
ఇక ఓవరాల్ సినిమా టాక్ విషయాని వస్తే.. ఇప్పుడిప్పుడే టాక్ మెల్లమెల్లగా బయటికివస్తోంది. కొందరు హిట్ అంటున్నారు. ఇంకొందరు బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇంకొందరు మెగాస్టార్ సూపర్ హిట్.. సినిమా ఓకే అంటున్నారు. పెదవి విరిచిన వారూ వున్నారు. మొత్తమ్మీద ఇప్పటికి వినిపిస్తున్న ట్రెండ్ ప్రకారం సినిమాకి ఓవరాల్ గా మిశ్రమ స్పందన వుంది. అయితే బాక్సాఫీసు లెక్కల విషయానికి వస్తే మొదటి నాలుగు రోజులు ఈసినిమాకి తిరుగులేదు. మెగాస్టార్ కుమ్మేయడం ఖాయం. అయితే తర్వాత ఎలా ఉటుందనేది బాక్సాఫీసు రిపోర్టే చెప్పాలి.