‘క‌ల్కి’లో ‘ఖైదీ’ సీన్!

‘క‌ల్కి’ సినిమా చూసిన‌వాళ్లంద‌రికీ ఓ సీన్ త‌ప్ప‌కుండా గుర్తుండే ఉంటుంది. రాజ‌శేఖ‌ర్ ఓ థియేట‌ర్లో కూర్చుని సినిమా చూస్తుంటే ‘సాగ‌ర సంగ‌మం’లోని ‘త‌కిట త‌థిమి’ అనే పాట వ‌స్తుంటుంది. రాజ‌శేఖ‌ర్‌ని వెదుక్కుంటూ రాహుల్ రామ‌కృష్ణ అక్క‌డికి వ‌స్తాడు.

నిజానికి ఆ స‌మ‌యంలో తెర‌పై ‘ఖైదీ’లోని సీన్ ని ప్లే చేశారు. అక్క‌డ చిరంజీవిని ఉద్దేశిస్తూ ఓ డైలాగ్ కూడా రాజ‌శేఖ‌ర్‌తో కూడా చెప్పించారు. ‘ఎవ‌డీ కుర్రాడు బాగా చేస్తున్నాడు.. త‌ప్ప‌కుండా ఫ్యూచ‌ర్‌లో స్టార్ అవుతాడు’ అనే డైలాగ్ అది. ‘క‌ల్కి’ 1983 నేప‌థ్యంలో సాగే క‌థ. చిరంజీవి అప్ప‌టికి స్టార్ అవ్వ‌లేదు. కాబ‌ట్టి… ఈ డైలాగ్ స‌రిగ్గా సరిపోయింది.

కానీ ఆ త‌ర‌వాత దాన్ని ‘సాగ‌ర సంగ‌మం’గా మార్చి రీషూట్ చేశారు. చిరంజీవి సీన్‌ని పెట్టుంటే మంచి అప్లాజ్ వ‌చ్చేది. కాక‌పోతే.. ‘చిరంజీవిని వాడుకున్నాడు’ అంటూ చిరంజీవి ఫ్యాన్స్ ఎక్క‌డ త‌న‌ని టార్గెట్ చేస్తారో అని… ఈ సీన్‌ని మార్చి రాయించాడ‌ట రాజ‌శేఖ‌ర్‌. ‘గ‌రుడ‌వేగ‌’ స‌మ‌యంలో చిరుతో ప్ర‌చార చిత్రాన్ని ఆవిష్క‌రింప‌జేశాడు రాజ‌శేఖ‌ర్‌. ఆ సినిమా హిట్ట‌య్యింది. ఆ త‌ర‌వాత రాజ‌శేఖ‌ర్ వైకాపాలో చేరారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి వ్య‌తిరేకంగా గాజువాక‌లో ప్ర‌చారం కూడా చేశారు. ఆ స‌మ‌యంలో చిరంజీవి ఫ్యాన్స్ నుంచి విమ‌ర్శ‌లు, శాప‌నార్థాలూ వినిపించాయి. ‘అవ‌స‌ర‌మైన‌ప్పుడు చిరంజీవిని వాడుకున్నావ్‌’ అంటూ ట్రోల్ చేశారు. ఇప్పుడు కూడా తెర‌పై చిరంజీవి సీన్‌ని చూపిస్తే.. అలాంటి ట్రోల్స్ ఎదుర్కోవాల్సివ‌స్తుంద‌నేది రాజ‌శేఖ‌ర్ భ‌యం. అందుకే ఖైదీ సీన్ లేపేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘RRR’ ఫ్లాప్ అయితే పండ‌గేనా?

ఆర్జీవీ అంతే. ఎక్క‌డ కెలకాలో అక్క‌డ కెలుకుతాడు. పైగా త‌న సినిమా విడుద‌ల అవుతుంటే... ఆ కెలుకుడు కార్య‌క్ర‌మం ఇంకాస్త ఎక్కువ‌గా ఉంటుంది. `క్లైమాక్స్‌` అనే సినిమాని ఇప్పుడు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తున్నాడు...

ఆర్‌జీవీ… రీ రిలీజ్‌!‌

ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా 'క్లైమాక్స్‌' సినిమాని విడుద‌ల చేస్తున్నాడు ఆర్జీవీ. ఈ సాయింత్రం నుంచే ఆ ర‌చ్చ మొద‌లు కానుంది. ఈ సినిమా చూడాలంటే వంద రూపాయ‌లు చెల్లించాల్సివుంటుంది. ఈ వ్యాపారం గిట్టుబాటు...

మీడియా వాచ్ : ఈనాడులో ఉద్యోగాలు సేఫ్.. జీతాలు కట్..!

దశాబ్దాలుగా ఎదురు లేకుండా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ఈనాడు ఎప్పుడూ ఎదుర్కోనంత ఆర్థిక పరమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. కోవిడ్ దెబ్బకు ఆర్థిక వనరులన్నీ తగ్గిపోగా.. నెలవారీ లోటు కోట్లలోనే ఉంటోంది. అదే సమయంలో......

‘పుష్ష‌’లో… స్టార్ల హంగామా

టాలీవుడ్ కి పాన్ ఇండియా మోజు ప‌ట్టుకుంది. అయితే.. పాన్ ఇండియా ప్రాజెక్టు అంత ఈజీ కాదు. బోలెడ‌న్ని హంగులుండాలి. అన్ని భాష‌ల‌కూ, అన్ని ప్రాంతాల‌కూ న‌చ్చే క‌థ‌లు ఎంచుకోవాలి. దానికి త‌గ్గ‌ట్టు...

HOT NEWS

[X] Close
[X] Close