రివ్యూ: కింగ్ ఆఫ్ కొత్త

King Of Kotha Movie Telugu Review

రేటింగ్‌: 2.25/5

ఒక నటుడికి ఏదో ఒక ఇమేజ్ రావడం చాలా ముఖ్యం. అలాగని ఒకే ఇమేజ్ ని కొనసాగించడం కూడా మంచిది కాదు. వచ్చిన ఇమేజ్ తో కెరీర్ ని మెల్లమెల్లగా నిర్మించుకొంటూ, వినూత్నమైన చిత్రాలు చేసుకుంటూ వెళితేనే మనుగడ వుంటుంది. దుల్కర్ స‌ల్మాన్‌ ఈ సంగతి తెలుసు. త‌న‌పై ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ఉంది. ఇప్పటివరకూ తను చేసిన పాత్రన్నీ ఆ ఇమేజ్ చుట్టూ తిరిగినవే. ఐతే తనని తానూ కొత్తగా చూపించడం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు దుల్కర్. ఈ క్రమంలో కెరీర్ లో తొలిసారి ఓ గ్యాంగ్ స్టర్ డ్రామా చేశాడు. అదే కింగ్ అఫ్ కొత్త. మరి ఈ సినిమా దుల్కర్ లో మాస్, యాక్షన్ కోణాన్ని ఎలా చూపించింది? ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో వున్న కొత్తదనం ఏమిటి ?

క‌న్నాభాయ్ (షబీర్ కల్లరక్కల్) కొత్త అనే టౌన్ కి కింగ్. లా అండ్ ఆర్డర్ ని చేతులోకి తీసుకొని తన ఇష్టారాజ్యంగా పాలిస్తుంటాడు. అదే ప్రాంతానికి హుస్సేన్ ( ప్రసన్న) సీఐ గా వస్తాడు. క‌న్నాభాయ్‌… హుస్సేన్ ని దారుణంగా అవమానిస్తాడు. దీంతో ఎలాగైనా కన్నాని అంతం చేయాలనుకున్న హుస్సేన్ కి రాజు (దుల్కర్ స‌ల్మాన్‌) కి గురించి తెలుస్తుంది. రాజు ఎవరో కాదు.. కన్నాకంటే ముందు అతనే కొత్త కి కింగ్. కన్నా, రాజు గ్యాంగ్ లో ఓ సభ్యుడు. ఇద్దరు మంచి స్నేహితులు. ఐతే రాజు కొన్ని ఆనివార్యకారణాల వల్ల‌ కొత్త ని వ‌దిలేసి…యూపీ వెళ్ళిపోతాడు. అసలు రాజు ఎందుకు కొత్తని విడిచివెళ్ళిపోయాడు? మళ్ళీ కొత్తకి వచ్చిన రాజుకి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? రాజు కథలో తార (ఐశ్వర్య లక్ష్మీ ) పాత్ర ఏమిటి ? ఇదంతా తెరపై చూడాలి.

గ్యాంగ్ స్టర్ డ్రామాలు దాదాపు ఒక ఫార్మెట్ లో సాగుతాయి. పవర్, ప్రేమ, నమ్మకద్రోహాలు, వెన్నుపోటు, పగ.. ఇలాంటి ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతాయి. కింగ్ అఫ్ కొత్తలోని ఎమోషన్స్ కూడా దాదాపు ఇవే వుంటాయి. అందుకే తెరపై సన్నివేశాలని చుస్తున్నప్పుడు ఇంతకుముందు ఎక్కడో చూసిన ఫీలింగే కలుగుతుంది. 80లలో జరుగుతుంది ఈ కథ. ఆ కాలం జరిగే కథని చెప్పాలంటే ఆ కాలం నాటి కథనంతో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దర్శకుడు అప్పటి సినిమాల్ని చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తూ ఒకొక్క సన్నివేశాన్ని వివరంగా చూపిస్తూ సాగదీసుకుంటూ వెళ్లారు.

ఈ కథ మొదలుపెట్టడమే చాలా బద్ధకంగా వుంటుంది. హీరో పాత్రని తెరపైకి తీసుకురావడానికి దాదాపు ఇరవై నిమిషాల సమయం పట్టింది. అది కూడా కొత్తగా ఏం వుండదు. తెలుగు సినిమాల్లో ఇలాంటి బిల్డప్ ఇంట్రోలు అడుగుకొకటి కనిపిస్తుంది. బహుశా మలయాళీ ప్రేక్షకులు ఇలాంటి ఇంట్రోలని కొత్తగా ఫీలౌతారేమో. ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో కథానాయకుడికి ఒక లక్ష్యం అంటూ వుండదు. దీనికి తగట్టుగానే తెరపై కదిలే సన్నివేశాలు కూడా కథని ఒక తీరానికి తీసుకెలుతున్న ఫీలింగ్ ఇవ్వ‌వు.

ప్రేమ, స్నేహం, సిస్టర్ సెంటిమెంట్.. ఈ మూడు అంశాలని నమ్ముకుంటూ ఈ కథని రాసుకున్నాడు దర్శకుడు. ఐతే ఇందులో రాజు, తారల మధ్య నడిచే ప్రేమకథ ప్రభావంతంగా వుండదు. పైగా ఆ ప్రేమకథ నుంచి వచ్చిన సంఘర్షణ కూడా రొటీన్ గా వుంటుంది. రాజు పాత్ర చివర్లో ‘ప్రేమించిన అమ్మాయి శీలంపై అనుమానపడకూడదు’ అని చెప్తాడు. ఈ డైలాగ్ లో చాలా లోతు వుంది. తను కోల్పోయిన జీవితం వుంది. కానీ ఈ డైలాగ్ లోని లోతుని మామూలు ప్రేక్షకుడు ఫీలవ్వడు. దీనికి కారణం.. ఆ ప్రేమకథని దర్శకుడు తెరకెక్కించిన విధానంలోని లోపం.

సిస్టర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే స్నేహం చుట్టూ నడిపిన సన్నివేశాలు మాత్రం కొంతలో కొంత బెటర్ అనిపిస్తాయి. రాజు తిరిగి కొత్తకి వచ్చిన తర్వాత కూడా కన్నాని చంపడం తన లక్ష్యం కాదు. దీంతో ఈ కథ ఎలా ముగుసుందనే ఆసక్తి ప్రేక్షకుడి కలుగుతుంది. కానీ కన్నా పాత్రని రొటీన్ గా చేసేసి ఈ కథకి శుభం కార్డు వేయడం ఎంతగా ఆకట్టుకోదు. పైగా ఈ కథని ముగించడానికి దర్శకుడు చాలా ఇబ్బంది పడిపోయాడు. దాదాపు మూడు యాక్షన్ ఘట్టాలు సెకండ్ హాఫ్ లో వస్తాయి. ఆ మూడూ క్లైమాక్స్ లానే అనిపిస్తాయి. అందులో ఏ సీన్ దగ్గరైన ఈ కథని పూర్తి చేయొచ్చు. కానీ ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెడుతూ సుధీర్గమైన యాక్షన్ సీన్స్ తీసుకుంటూ మళ్ళీ ప్రేక్షకులు ఊహించినట్లే రొటీన్ ఎండింగ్ ఇవ్వడం నిరాశ కలిగిస్తుంది.

ఇంత మాస్ క్యారెక్టర్ లో కనిపించడం దుల్కర్ కి ఇదే తొలిసారి. రాజు పాత్రలో సహజంగా కనిపించడానికి ప్రయత్నించాడు. ఇరవై ఏళ్ళ రాజు, వయసుపై బడిన రాజు.. ఇలా రెండు షేడ్స్ లో వైవిధ్యం చూపించాడు. గ్యాంగ్ స్టార్ అంటే బిల్డప్ వుంటుంది. కానీ రాజు పాత్రని మాత్రం దర్శకుడు సహజంగా ట్రీట్ చేశాడు. తన చేతికి ఒక పెన్ దొరికిన సరే దాంతోనే ప్రాణాలు తీసేసే పాత్రలానే చూపించాడు. ఐశ్వర్యలక్ష్మీ పాత్ర మరీ అండర్ లైన్ చేసి చెప్పుకునేలా ఏం వుండదు. క‌న్నా పాత్రలో క‌నిపించిన ష‌బ్బీర్ కి మంచి నిడివి వున్న పాత్ర దక్కింది. దాదాపు హీరోకి సమానంగా వుంటుంది. ఆ పాత్రని చక్కగా పోషించాడు. జింబ‌న్ వినోద్ ఇంగ్లీష్ డైలాగులు అక్కడక్కడా నవ్విస్తాయి. లేడీ విల‌న్‌గా చేసిన న్యాల ఉష‌ పాత్ర గుర్తుపెట్టుకునేలా వుంటుంది.

టెక్నికల్ గా డీసెంట్ వర్క్ కనిపించింది. నేపధ్య సంగీతం ఈ సినిమాకి ప్రాధాన ఆకర్షణ. సెకండ్ హాఫ్ లో సంగీత దర్శకుడుపైనే భారం మోపేశారు. వింటేజ్ లుక్ వచ్చేలా ఆర్ట్ వర్క్ చక్కగా చేశారు. ఎడిటర్ ఇంకాస్త షార్ఫ్ గా ఉండాల్సింది. కెమెరాపనితనం బావుంది. ద‌ర్శకుడు అభిలాష్ జోషి ఎంచుకున్న కథ, టేకింగ్ దుల్కర్ కి కొత్త ఏమో కానీ ప్రేక్షకులకి కాదు. ఐతే లవర్ బాయ్ ఇమేజ్ నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న దుల్కర్ కి ‘కింగ్ ఆఫ్ కొత్త’ ఆ ప్రయత్నంలో ఒక అడుగనుకోవచ్చు.

రేటింగ్‌: 2.25/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూల్స్ రంజన్.. సూపర్ కాన్ఫిడెన్స్

ఈవారం వస్తున్న ప్రామెసింగ్ సినిమాల్లో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ముందువరుసలో వుంది. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడు ఇమేజ్ తో చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. రూల్స్ రంజన్ ఆ...

సిద్దార్థ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !

సిద్ధార్థ్ కి సినిమాలు కలసిరావడం లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఏదీ నిలబడటం లేదు,. హిట్టు అనే మాట రావడం లేదు. ఇటివలే టక్కర్ అనే సినిమా చేశాడు. సిద్ధార్థ్ పై...

లోకేష్‌పై అసలు ఎఫ్ఐఆర్లే లేవని చెబుతున్న సీఐడీ

లోకేష్ ను అరెస్టు చేయడం ఖాయమని ఊగిపోయిన సీఐడీ ఇప్పుడు ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్‌లో పెట్టలేదని చెబుతోంది. ఐఆర్ఆర్ కేసులో ఏ 14గా చేర్చి.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా ఢిల్లీ వెళ్లి .....

హిందీలో మార్కులు కొట్టేసిన రవితేజ

రవితేజ చక్కని హిందీ మాట్లడతారు. ఆయన నార్త్ లో కొన్నాళ్ళు వుండటం వలన హిందీ అలవాటైయింది. ఇప్పుడీ భాష 'టైగర్ నాగేశ్వరరావు' కోసం పనికొచ్చింది. రవితేజ కెరీర్ లో చేస్తున్న మొదటి పాన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close