`క` సినిమా కిరణ్ అబ్బవరంకి గట్టి బూస్టప్ ఇచ్చింది. ఆ తరవాత తన స్పీడే మారిపోయింది. తన చేతిలో చాలా సినిమాలు ఉన్నాయిప్పుడు. నిర్మాతగానూ బిజీ అవ్వాలని చూస్తున్నాడు. త్వరలో తన బ్యానర్ నుంచి ఓ ట్రయాలజీ మొదలు పెట్టబోతున్నాడు. మూడు సినిమాల్ని వరుసగా ప్రకటించబోతున్నాడు. మూడు కథలూ ఒకదానితో మరోటి సంబంధం ఉన్నవే. ‘ఉగాదిరోజు’, ‘దీపావళి రోజు’, ‘రిలీజ్ రోజు’ అంటూ.. వీటికి నామకరణం చేస్తున్నాడు. అన్నట్టు ఈ కథలన్నీ సినిమా ఇండస్ట్రీకి చెందినవే. దర్శకుడిగా తన టీమ్ లోని ఓ టెక్నీషియన్ ని పరిచయం చేయబోతున్నాడు. ఓ మంచి రోజు చూసుకొని – ఈ ట్రయాలజీ ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ‘కె -ర్యాంప్’ అనే సినిమా పూర్తి చేశాడు. ఈ దీపావళికి రిలీజ్ కానుంది. ‘చెన్నై లవ్ స్టోరీస్’ అనే మరో సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. ఇటీవల శ్రీకాంత్ అడ్డాల ఓ కథ చెప్పారు. సుకుమార్ రైటింగ్స్ లోనూ ఓ సినిమా చేయబోతున్నాడు కిరణ్. ఇవి కాకుండా మరో రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. బహుశా.. టాలీవుడ్ లో ఇన్ని సినిమాలు చేస్తున్న యంగ్ హీరో…కిరణ్ అబ్బవరం మాత్రమే.
‘క-2’ కథ కూడా ఓ వైపు రెడీ అవుతోంది. ఈ సినిమాని కూడా వీలైనంత త్వరగా మొదలెట్టాలని చూస్తున్నాడు కిరణ్. త్వరలో ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ రావొచ్చు.