‘తిరుమ‌ల’ కెరీర్ తిర‌గ‌బ‌డుతోందా?

నేను శైల‌జ సినిమాతో అంద‌రినీ ఆక‌ట్టుకొన్నాడు కిషోర్ తిరుమ‌ల‌. ఆ సినిమా హిట్ట‌వ్వ‌డ‌మే కాదు, రామ్ కెరీర్‌కి మ‌ళ్లీ ఊపు తెచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ రామ్‌తోనే ‘ఉన్న‌ది ఒకటే జింద‌గీ’ సినిమాని రెడీ చేశాడు. ఈ మ‌ధ్య‌లో వెంక‌టేష్‌తో ఓ సినిమా చేయాల్సింది. కానీ.. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. వెంకీ సినిమా ఆగిపోవ‌డం వ‌ల్ల‌… కిషోర్ కెరీర్‌లో కాస్త గ్యాప్ వ‌చ్చింది. హిట్ వ‌చ్చినా దాన్ని క్యాష్ చేసుకొంటూ వెంట‌నే ఓ సినిమా చేయ‌లేక‌పోయాడు. అయితే ఇప్ప‌టికీ మించిపోయిందేం లేదు. త‌న‌కీ మంచి ఆఫ‌ర్లే ఉన్నాయిప్పుడు. ‘ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ’ హిట్ అయితే గ‌నుక… కిషోర్ జాక్ పాక్ కొట్టేసిన‌ట్టే. కిషోర్ కోసం రామ్ చ‌ర‌ణ్ ఎదురుచూస్తున్నాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే నానితో ఓ ప్రాజెక్ట్ ఓకే అయింద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. యువ ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డానికి రామ్ చ‌ర‌ణ్ ఉత్సాహం చూపిస్తున్నాడు. ‘నేను శైల‌జ‌’ త‌ర‌వాత కిషోర్ తిరుమ‌ల‌తో చ‌ర‌ణ్ మాట్లాడ‌ట కూడా. ‘ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ’ హిట్ట‌యితే మాత్రం వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా ప‌ట్టాలెక్క‌డం ఖాయం అని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కిషోర్ త‌గ్గ‌ర ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ అనే స్క్రిప్టు రెడీగా ఉంది. వెంకీ కోసం రాసుకొన్న క‌థ ఇది. కొద్ది మార్పులు చేసుకొంటే ఏ పెద్ద హీరోకైనా సూట‌యిపోయే క‌థ కాబ‌ట్టి.. తిరుమ‌ల మ‌రో సినిమా మొద‌ల‌వ్వ‌డానికి పెద్ద టైమ్ తీసుకోక‌పోవొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.