కొడకా కోటేశ్వరరావు…పార్టీ కి పవన్ రెడీ…

పవన్ మాట్లాడితేనే… కిక్ వచ్చేస్తుంది పవన్ ఫాన్స్ కి. ఇక పాటపాడితే కిక్కే కిక్కు. పవన్ కి ఫోక్ బాణీలంటే చాలా ఇష్టం. తాను పాడిన పాటలన్ని అలాంటివే. అత్తారింటికి దారేది లో కాటమ రాయుడా పాటతో కిర్రెక్కించాడు. ఆజ్ఞతవాసి లోనూ పవన్ తో పాటపాడించడు త్రివిక్రమ్. డిసెంబర్ 31 న సాయంత్రం 6 గంటలకి ఈ పాట విడుదల చేస్తారు.

ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన టీజర్ వచ్చింది. కొడకా… అంటూ పవన్ తనదైన శైలిలో సిగ్గు పడుతూ… పాడాలా వద్దా అంటూ మొహమాట పడుతూ… కొడకా అంటూ పాట అందుకోవడం పక్కన త్రివిక్రమ్, భాస్కర భట్ల రవికుమార్, అనిరుధ్ ఉండడం టీజర్ లో కనిపించాయి. వాతావరణం చూస్తుంటే… పవన్ ఫాన్స్ పండగ చేసుకునే పాట వచ్చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. 31 పార్టీ… ఆడిరిపోవాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.