పంచతంత్రం సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు “హార్టులో హోల్” ఉందని చెప్పి ఎవరూ ఏమీ అనకుండా చేసుకుని చేయాల్సిన అల్లరి పనులన్నీ చేస్తూంటాడు. ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని కూడా హార్ట్ ఆపరేషన్ పేరుతో చాలా రోజులుగా ప్రశాంతంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో ఆయన చేసిన నిర్వాకాలకు … ఇప్పటికే వల్లభనేని వంశీకి దొరికిన చట్టపరమైన ట్రీట్మెంట్ కన్నా రెండింతలు ఎక్కువగా అనుభవించాల్సి ఉంది. కానీ అసలు కేసుల కథ ప్రారంభమయ్యే సరికి తనకు హార్ట్ ఆపరేషన్ అని కొడాలి నాని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు గుండెకు ప్యాడ్లు కట్టుకుని బయట కనిపిస్తున్నారు. అంతా అయిపోయాక ఆ ప్యాడ్లు తీసి … పార్టీ నేతలతో అంతర్గతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.
గుండె ఆపరేషన్ నుంచి కోలుకున్నట్లుగా స్పష్టం కావడంతో ఇప్పుడు ఆయనపై ఉన్న కేసులు బయటకు వస్తున్నాయి. విశాఖలో నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇది చిన్న కేసు అరెస్టు చేసేది కాదు . కానీ విచారణకు హాజరు కావాల్సిందే. గుడివాడలో రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసు, గుడివాడలో వార్డు వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించినందుకు IPC సెక్షన్ల 447, 506, R/w 34 కింద కేసు వంటివి ఉన్నాయి. అతే చాలా కేసుల్లో ముందస్తు బెయిల్స్ వచ్చాయి. కానీ అసలు గుడివాడలో చేసిన అరాచకాలు, దోపిడీలపై ఇప్పటికే విచారణలు పూర్తయ్యాయి. వాటి నివేదికలు రెడీగా ఉన్నాయి. ఆ కేసులు ఇంకా పెట్టలేదు.
గుడివాడను చాలా కాలంగా సొంత సామ్రాజ్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడ్డారు కొడాలి నాని అండ్ గ్యాంగ్. ఆయనతో పాటు ఆయన అనుచరులు గడ్డం గ్యాంగ్ గా మారి. దోచుకున్నారు. వారి లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి. కొడాలి నాని హార్ట్ ఆపరేషన్ పేరుతో ఆస్పత్రికి పోక పోతే ఈ పాటికి అసలు కథ ప్రారంభమయ్యేది. కోలుకునేందుకు సమయం ఇచ్చారు. ఇప్పుడు మెల్లగా బయటకు వస్తున్నారు కాబట్టి అన్ని వ్యవహారాలకూ లెక్కలు రెడీ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన ఆయనకు… సరైన బుద్ది చెప్పకపోతే ప్రజలు కూడా ప్రభుత్వానికి చేతకాదని అనుకుంటారు. చట్ట ప్రకారమే చేయాలనుకున్నది ప్రభుత్వం చేయాల్సి ఉంది. దానికి ఇప్పుడే యాక్షన్ ప్రారంభమయిందని అనుకోవచ్చు.