కేసినో పెట్టామని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానన్న కొడాలి నాని !

ఎదురుగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి.. కానీ అన్నీ నీ భ్రమ అని మాయపుచ్చే క్యారెక్టర్లు సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ఎక్కువగానే ఉంటాయి. గుడివాడలో కేసినో వ్యవహారం వైరల్ అయిన తర్వాత అక్కడ ఏమీ జరగలేదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. తన కల్యాణమండపంలో కేసినో పెట్టినట్లు నిరూపిస్తే ..అక్కడే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించేశారు. అసలు అక్కడ కేసినోలో పెట్టలేదని స్పష్టం చేశారు.

కేసినో అంటే ఏమిటో చంద్రబాబు, లోకేష్‌కు బాగా తెలుసన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరు వచ్చినా తనను ఏమీ చేయలేరని తేల్చేశారు. కేబినెట్ సమావేశంలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడినా కొడాలి నాని.. అసలు అక్కడ కేసినోనే పెట్టలేదని స్పష్టం చేశారు. మరి కే కన్వెన్షన్ సెంటర్‌లో రికార్డు చేసిన దృశ్యాలేమిటనేదానిపై కొడాలి నాని మాట్లాడలేదు.

నిరూపించాలని అంటున్నారు. బహుశా.. పోలీసులు విచారణ జరుపుతున్నారు…ఆ విచారణలో అక్కడ ఎలాంటి కేసినోలు నిర్వహించలేదని.. సాంస్కృతి కార్యక్రమాలు మాత్రమే నిర్వహించారన్న రిపోర్ట్ ఇస్తారన్న నమ్మకంతో కొడాలి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉన్నా… ప్రజలు అన్నీ ప్రత్యక్షంగా చూశారు.. వారు కూడా.. అక్కడేమీ జరగలేదని అనుకోరు కదా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రంగీలాలో చిరు – ర‌జ‌నీ – శ్రీ‌దేవి..?

రంగీలా... రాంగోపాల్ వ‌ర్మ త‌డాఖాని బాలీవుడ్ కి రుచి చూపించిన సినిమా. ఊర్మిళ‌ని ఈ సినిమా సూప‌ర్ స్టార్ ని చేసింది. నిజానికి.. ఈ క‌థ చిరంజీవి, ర‌జ‌నీ కాంత్, శ్రీ‌దేవిల‌తో చేయాల్సింద‌ట‌....

‘స‌లార్’ రిలీజ్ డేట్ .. పెద్ద ప్లానే ఉంది!

పాన్ ఇండియా ప్రాజెక్టు స‌లార్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. 2023 సెప్టెంబ‌రు 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఇది.. `రెబ‌ల్` రిలీజ్ డేట్. దాంతో ప్ర‌భాస్ అభిమానులు కంగారు ప‌డుతున్నారు.కాక‌పోతే... ఈ...

ఆ ఇద్ద‌ర్నీ గీతా ఆర్ట్స్ భ‌లే ప‌ట్టేసింది

సినిమా విడుద‌ల అయ్యాక, రిజ‌ల్ట్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి చేతిలో అడ్వాన్సులు పెట్ట‌డం స‌ర్వ సాధార‌ణ‌మైన సంగ‌తే. ఏ సినిమా హిట్ట‌వుతుందా? అని నిర్మాత‌లు ఆశ‌గా ఎదురు చూస్తుంటారు. అయితే.. విడుద‌ల‌కు...

‘బింబిసార 2’లో… దిల్ రాజు హ్యాండ్‌

ఎవ‌రూ ఊహించ‌లేనంత పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది బింబిసార‌. క‌ల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అంద‌రి దృష్టీ పార్ట్ 2పై ఉంది. బింబిసార విజ‌యంతో.. పార్ట్ 2పై న‌మ్మ‌కాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close