కొడాలి నాని హక్కులనూ నిమ్మగడ్డ కాలరాశారట..!

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే వైసీపీ నేతలకు అలుసైపోయారు. ఆయనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి… ఆయన చట్ట బద్ధంగా ఏదైనా చర్య తీసుకుంటే మాత్రం… తమ హక్కులకు భంగం కలిగించారంటూ…ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చేస్తున్నారు. గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆ పని చేయగా.. తాజాగా కొడాలి నాని వంతు. ఆయనపై కేసు నమోదు చేయాలని… మీడియాతో మాట్లాడకూడదని… ఎస్‌ఈసీ ఆంక్షలు విధించారు. అయితే తాను వివరణ ఇచ్చినా తనపై చర్యలు తీసుకున్నారంటే.. తన హక్కులను భంగం కలిగించడమేనని తన తరపున ప్రివిలేజ్ నోటీసును అసెంబ్లీ కార్యదర్శికి పంపించారు.

దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకుని.. ప్రివిలేజ్ కమిటీకి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రివిలేజ్ కమిటీ సమావేశమై నిమ్మగడ్డకు నోటీసులు లాంటి… చర్యలు తీసుకుంటుంది. అయితే ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ అధికారాలు ఉన్న ఎస్‌ఈసీ … తాను తీసుకున్న నిర్ణయాలు తప్పని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎలా నిర్ణయిస్తుందో న్యాయనిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. పెద్దిరెడ్డి, బొత్స ఇచ్చిన నోటీసులే వివాదాస్పదం అవుతాయన్న అంచనాలు రావడంతో… ఎస్‌ఈసీకి నోటీసులు ఇంత వరకూ జారీ చేయలేదు. కానీ బెదిరింపులు మాత్రం ఓ రేంజ్‌లో చేస్తూ వస్తున్నారు .

ఇప్పుడు కొడాలి నానికి కూడా అదే అస్త్రం లభించింది. మరో వైపు ఎస్‌ఈసీ తీసుకుంటున్న చర్యలను కోర్టు తగ్గిస్తూ వస్తూండటంతో కొడాలి నాని కూడా ఉత్సాహంగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా వేశారు. కోర్టు ఆయనకు కూడా రిలీఫ్ ఇస్తుందేమో కానీ… కొడాలి కాకపోతే.. మరో వైసీపీ నేతలు పెద్ద నోరు చేసుకుని నిమ్మగడ్డపై చెలరేగిపోవడానికి రెడీగా ఉంటారు. అలాంటి నేతలకు వైసీపీలో కొదవ లేదు. అసలు వైసీపీ వ్యూహమే అది. కాబట్టి… కొడాలి నాని కూడా వైసీపీ వ్యూహంలో భాగంగానే నోటీసులు పంపారని అనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close