మెరుగైన చికిత్స కారణంతో కొడాలి నాని అమెరికాకు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గుండె ఆపరేషన్ నుంచి కోలుకుంటున్న ఆయనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. వల్లభనేని వంశీ జైలు నుంచి వచ్చే సరికి ఆయనను లోపలికి పంపుతారని చెప్పుకుంటున్నారు. దీంతో ఆయన అప్రమత్తమయ్యారు. తాను అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా బయటకు సమాచారం లీక్ చేశారు.
కొడాలి నాని చిన్న చిన్న నేరాలు చేయలేదు. దానికి సంబంధించిన కేసులు అన్నీ రెడీగా ఉన్నాయి. ఆయన చేసిన రాజకీయాలకు.. గుండె నొప్పి కాదు కదా.. ఇంకేం వచ్చినా వదిలి పెట్టే అవకాశం ఉండదు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని నారా లోకేష్ గతంలో ప్రకటించారు. ఆ ప్రకారం ఇప్పటికే స్కెచ్ పూర్తయిందని అంటున్నారు. గుండెనొప్పి అంటూ కొడాలి నాని బతికిపోయారు కానీ లేకపోతే ఇప్పటికే వంశీతో కలిసి విజయవాడ జైల్లో ఉండేవారని చెబుతారు. ఇప్పుడు ఆయన ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్ వచ్చారు. ఇక్కడే ఇతర వైద్య పరీక్షలు చేయించుకుని.. మెడికేషన్ లో ఉన్నారు.
హైదరాబాద్ లో ఉంటే.. సేఫ్ లేదని అమెరికా వెళ్తే బెదరని అనుకుంటున్నారు. ఇందు కోసం ట్రంప్ తీసుకు వచ్చిన గ్రీన్ కార్డు వీసా సహా చాలా అవకాశాలు పరిశీలించారు. ప్రస్తుతానికి మెడికల్ వీసా తీసుకుని వెళ్తున్నారని తర్వాత అక్కడే ఉండటానికి ఏర్పాట్లు చేసుకుంటారని చెబుతున్నారు. వంశీ కూడా గతంలో అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించారు కానీ.. తక్కువ అంచనా వేసి హైదరాబాద్ లో కూర్చుని ప్రభుత్వంపైనే కుట్రలు చేశారు. ఇప్పుడు జారిపోతున్న ప్యాంట్లు లాక్కుంటూ కోర్టుకు.. జైలుకు మధ్య తిరుగుతున్నారు.
ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదని కొడాలి నాని అనుకుంటున్నారు. ప్రస్తుతం పరామర్శకు వస్తామని కబురు చేస్తున్నా.. వైసీపీ ముఖ్యనేతల్ని కూడా కొడాలి నాని ఆహ్వానించడం లేదని అంటున్నారు. తన కుటుంబసభ్యులతో పాటు ఒకరిద్దరు కీలక అనుచరులతో మాత్రమే టచ్ లో ఉన్నారని అంటున్నారు. వైసీపీ నీడ పడకుండా చూసుకుని అమెరికా వెళ్లారని అనుకుంటున్నారు.