మహాకూటమికి బ్రాండ్ అంబాసిడర్ కోదండరాం ..!

మహాకూటమిలో సీట్లు , స్థానాల సంగతి పక్కన పెడితే.. తెలంగాణ జన సమితి అధినేత కోదండరాంకు… మహాకూటమిలో అగ్రపీఠం లభిస్తోంది. కూటమికి ఆయననే ముఖచిత్రంగా పెట్టి ప్రచార కార్యక్రమాలు ప్రారంభిస్తోంది. మహాకూటమి… కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని కూడా సిద్దం చేసుకుంది. రేపోమాపో ప్రకటించబోతోంది. ఈ కార్యక్రమానికి చైర్మన్ గా .. కోదండరాంను నియమించాలని.. ఢిల్లీలో స్థాయిలో రాహుల్ గాంధీనే నిర్ణయించారు. కూటమి తరపున ప్రధాన ప్రచార కర్త ఆయనే కానున్నారు.

ఎమెల్యే కాకపోయినా చక్రం తిప్పే చాన్స్..!

కోదండరాం నిజానికి… ఓ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. జనగాం సీటును ఆయన కోసం రిజర్వ్ చేశారు కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వ్యూహాం సిద్ధం చేశారు. కోదండరాం.. ఒక్క స్థానంలో పోటీ చేస్తే.. ఆయన ఆ స్థానానికే సమయం కేటాయించాల్సి వస్తుంది. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కోదండరాం ఇమేజ్ పార్టీకి ఉపయోగపడాలంటే.. ఎన్నికల బరిలో నిలవకుండా.. కూటమి కోసం ప్రచారం చేయాలని కోరారు. దానికి కోదండరాం అంగీకరించారు. జేఏసీ నాయకునిగా కోదండరాంకు… ఉద్యమంలో పని చేసిన యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో టీఆర్ఎస్ సర్కారుపై ఉద్యమకారుల్లో వ్యతిరేకత ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకే కాదు.. అసలు గతంలో చెప్పినట్లుగా.. ఉద్యోగాలు సహా ఎలాంటి హామీలు నెరవేరలేదన్నది వారి వాదన. కోదండరాం కూడా.. తెలంగాణ ఏర్పాటు లక్ష్యం దెబ్బతింటున్నదని… ఆంధ్రా కాంట్రాక్టర్లకు. తెలంగాణ వ్యతిరేకులకు కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని… విమర్శలు గుప్పించారు. కోదండరాంకు ఓ రాజకీయ పార్టీ నేతకు ఉండే ఫాలోయింగ్ కన్నా… భిన్నమైన అనుచరగణం ఉంది.

తెలంగాణ వాదులందర్నీ కూటమి వైపు తీసుకొస్తారా..?

తాము ఎలాంటి తెలంగాణ కోరుకుందో.. కోదండరాంకు క్లారిటీ ఉందని.. ఆయన ప్రభుత్వంలో కలకంగా ఉంటే.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయన్న భావనలో ఉన్నారు. ఇప్పుడు మహాకూటమి వల్ల ఆ పరిస్థితి రావడం అసాధ్యమేమి కాదన్న భావన కనిపిస్తోంది. అందుకే.. తెలంగాణ ఉద్యమకారులు.. కోదండరాం వైపు అంటే.. మహాకూటమి వైపు ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా.. ప్రజల్లోకి వెళ్తోంది. కాంగ్రెస్ కు కోదండరాం.. తోడైతే.. కూటమికి అడ్వాంటేజ్ వస్తుందన్న నమ్మకం ఉంది. పోటీతో సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వంలో కోదండరాం కీలకంగా ఉంటారన్న క్లారిటీ ఉంటుంది కాబట్టి.. ఉద్యమకారులు, తెలంగాణవాదులు మరో ఆలోచన చేయకపోవచ్చని నేతలు ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ టీడీపీతో కలవడాన్ని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ వస్తే ఏపీ ప్రయోజనాల కోసమే పని చేస్తారన్న వాదనను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనికి కాంగ్రెస్ నేతలు సమాధానం ఇవ్వడం కన్నా… కోదండరాంను ముందు పెడితే సరిపోతుందని కూటమి వ్యూహం సిద్దం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ కోసం ఉద్యమం చేసిన కోదండరాం… తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడతారని ఎవరూ అనుకోరు. అందుకే టీడీపీపై తెలంగాణ వ్యతిరేక ముద్ర వేసి.. దాన్ని కాంగ్రెస్ కు అంటించాలనుకుంటున్న టీఆర్ఎస్ కు .. కోదండరామే ఓ సమాధానంగా ఉంచబోతోంది కాంగ్రెస్ పార్టీ. అంటే.. కేసీఆర్ వర్సెస్ కోదండరాం అన్నట్లుగా ప్రచారం సాగుతుంది

ఉత్తరతెలంగాణలో కేసీఆర్‌ను దెబ్బకొట్టబోతున్న కోదండరాం..!

టీఆర్ఎస్ బలంగా ఉందని భావిస్తున్న ఉత్తర తెలంగాణలో కోదండరాంను తురుపుముక్కగా కూటమి ఉపయోగించుకోనుంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు వల్ల… గ్రేటర్ తో పాటు దక్షిణ తెలంగాణలోనూ సమీకరణాలు కలసి వస్తాయి. కోదండరాం మహాకూటమికి ఓట్ల పరంగా కాకుండా.. అసలు ఓ ముఖచిత్రంగా ఉండటం వల్లే.. టీఆర్ఎస్ కు ఎక్కువ మైనస్ అవుతుంది. రాహుల్ ఇదే ప్లాన్ అమలు చేస్తున్నారు. పక్కా ఈక్వేషన్స్‌ను… మహాకూటమి ఫాలో అవుతుంది. ఫలితం ఎలా ఉంటుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ సలహాదారులు కి కనీస అవగాహన లేదా ?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత...

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

బాల‌య్య ఇష్యూ: కేసీఆర్‌పై నెట్టేశారుగా!

`ఇండ్ర‌స్ట్రీ స‌మావేశాల‌కు న‌న్ను పిల‌వ‌లేదు` అన్న బాల‌య్య మాట - ప‌రిశ్ర‌మ‌లో కొత్త వివాదానికీ, కాంపౌండ్ రాజ‌కీయాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. బాల‌య్య‌ని పిల‌వ‌క‌పోవ‌డం త‌ప్పే అని ప‌రిశ్ర‌మ‌లో చాలామంది పెద్ద‌లు తేల్చేస్తున్నారు....

ద‌ర్శ‌కేంద్రుడి ‘కాన్సెప్ట్’ ఏమిటి?

న‌మోః వేంక‌టేశాయ త‌ర‌వాత మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌లేదు ద‌ర్శ‌కేంద్రుడు. ఆయ‌న సినిమాల‌కు దూరంగానే ఉంటూ వ‌చ్చారు. ద‌ర్శ‌కేంద్రుడు రిటైర్ అయిపోయార‌ని, ఆయ‌న ఇక సినిమాలు చేయ‌ర‌ని వార్త‌లొచ్చాయి. కానీ ఓ మంచి సినిమా...

HOT NEWS

[X] Close
[X] Close