✍ తాము గట్టిగా మాట్లాడుతున్నందునే పాలకులు ఉలికిపడుతున్నారని, పడి ఉంటారనుకున్న ప్రజలు ప్రశ్నించడం పాలకులకు ఇష్టం లేదని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అన్నారు. ఇలాంటి బెదిరింపులు ప్రజలకు, జెఎసికి కొత్త కాదని చెప్పారు. ప్రశ్నించే గొంతులు ఉండొద్దనే భావనలో పాలకులు ఉన్నారని, చేతనైతే చప్పట్లు కొట్టాల్సిందేనని, అవసరమైతే పాలాభిషేకం, పాదాభిషేకాలు చేస్తే ఇంకా సంతోషిస్తారని, అంతేకాని ప్రశ్నించడం మాత్రం ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. ఇలాంటి క్రమంలో జెఎసి నిలబడి ప్రశ్నించిందన్నారు.
నిరుద్యోగ నిరసన ర్యాలీ తదననంతరం పరిణా మాలపై కోదండరామ్ శుక్రవారం ఫేస్బుక్లో 8 నిమిషాల వీడియో మెసేజ్ ద్వారా స్పందించారు.
? నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాల్సింది పోయి తమపై అనేక రూపాల్లో దాడులకు పాల్ప డుతున్నారని ఆయన విమర్శించారు. అనేక నిర్భందాలు, అరెస్టులు చేసినా నిరుద్యోగ నిరసన ర్యాలీకి ప్రజల నుంచి అపురూప స్పందన లభిం చిందనే పాలకులు కుట్రతో జెఎసిని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నిరుద్యోగ సమస్యను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లామని, అధికారాన్ని నిలదీయడాన్ని ఏలినవారు సహించ లేకపోవడమే వర్తమాన పరిణామాలకు ఏకైక కారణమన్నారు.
? గతంలోనూ జెఎసిని లేకుండా కుట్రలు పన్నినా పడిపోలేదని, కూలిపోలేదని, ఇప్పుడూ మరోసారి అదే ప్రయత్నం జరిగింద న్నారు. జెఎసి ఎలాంటి సమస్యలను ఎదుర్కోవ డం లేదని, ఎలాంటి ఇబ్బందులూ లేవనేది అంద రూ గ్రహించాలన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించే వరకు జెఎసి నిద్రపోదని, జెఎసి ఐక్యంగానే ఉన్నదని, తమ ప్రయాణం యథావిధిగానే కొనసాగిస్తూ జెసిని సంఘటి తంగా నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. తమ కార్యకలాపాలను యథావిధిగానే నిర్వహిం చే స్థితిలో శక్తివంతంగానే ఉన్నామన్నారు. ప్రజల గొంతుకను నిరంతరం వినిపించేందుకు తమ కృషి ఎప్పటికీ ఉంటుందన్నారు. వర్తమాన పరిణామాలు జెఎసిని లేకుండా చేసే కుట్రగా గ్రహించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ది, వారి పురోభివృద్ధికి, ప్రజలందరికీ మేలు జరిగేలా తమ పని తాము కచ్చితంగా కొన సాగిస్తామని అన్నారు.
? పలు ఆంక్షల మధ్య తెలం గాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అదే తరహా లో సామాజిక తెలంగాణకు కృషి కొనసాగుతుం దన్నారు. నిరుద్యోగ సమస్యలపై తాము చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీని భగ్నం చేసే కుట్రలో రాష్ట్ర వ్యాప్తంగా 13వేల మందిని అరెస్ట్ చేశార ని, అయినా తమ గొంతులను మాత్రం నొక్కలేక పోయారన్నారు. నిరసన ర్యాలీకి ముందు మూడు రోజుల పాటు జెఎసి నేతల అరెస్టుల పర్వం కొనసాగిందని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోలీసులు తన ఇంటికి రాలేదని, అలాంటిది తన ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారని ఆయన వివరించారు. ర్యాలీ సందర్భంగా అనేక ఆంక్షలను విధించి, తమ నినాదాన్ని ప్రభుత్వమే ప్రచారం చేసిందన్నారు. తాము చేసిన ప్రయత్నం వల్ల ర్యాలీ డిమాండ్లను అందరికీ తెలిసిపోయిందన్నారు.