కోడికత్తి శీను బయటకు రాకుండా బాధితుడైన జగన్మోహన్ రెడ్డి కొత్త కొత్త పిటిషన్లు దాఖలు చేయడం సంచలనంగా మారుతోంది. ఇప్పటికి నాలుగేళ్లకుపైగా కోడికత్తి శీను జైల్లో ఉన్నారు. నిజానికి ఈ ఘటనలో ఎయిర్ పోర్టులో ఎప్పుడూ పని చేసే సీసీ కెమెరాలు ఎందుకు పని చేయలేదో కానీ.. ఇప్పుడీ అంశంపై కుట్ర మాత్రం చాలా ఎక్కువగా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసులా అసలు నిజాలు బయటకు రాకూడదన్న అభిప్రాయంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
బాధితుడు కుట్ర కోణం ఉందని ఆరోపించారని ఎన్ఐఏ ఆ కోణంలో విచారించలేదని చెప్పుకొస్తున్నారు. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుపై కేసులు ఉన్నాయని కోర్టులో వాదిస్తున్నారు ఆయనా ఆయనకు ఎయిర్ పోర్టులో పోస్టింగ్ ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా అనేక అనుమానాలు వ్యక్తం చేసి.. జనపల్లి శ్రీనివాసరావును మరింతగా ఇరికిస్తున్నారు.ఆయన బయటకు రాకపోవడం మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆ ముసలి తల్లిదండ్రులు నరకయాతన అనుభవిస్తున్నారు.
కోడికత్తి శీనును బయటకు తీసుకు వచ్చేందుకు ఇతరులు సాయం చేస్తున్నారు..కానీ ఈ ప్రయత్నాలను సీఎం జగన్ నిర్వీర్యం చేస్తన్నారు. తనపై దాడి జరిగిదే… నిజాలెంటో బయటకు రావాలని ఎవరైనా కోరుకుంటారు. దానికి రివర్స్‌లో సీఎం జగన్ తీరు ఉంది. అప్పట్లో ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏకి ఇచ్చే వరకూ పోరాడిన సీఎం జగన్ ఇప్పుడు ఎన్ఐఏ పైనా అదే తరహా వాదన కోర్టులో వినిపిస్తున్నారు. సీఎం జగన్ న్యాయవ్యవస్థతో ఆడుకుంటున్నారని….. తన స్వార్థం కోసం… కేసుల్ని ఆలస్యం చేస్తున్నారన్న విమర్శలు ఇందుకే వస్తున్నాయి.