కమల్ హాసన్ కూడా ట్వీటర్ లోకి ఎంట్రీ

ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ కూడా నిన్న ట్వీటర్ లో ప్రవేశించారు. గణతంత్రదినోత్సవ సందర్భంగా ఆయన ట్వీటర్ లో ప్రవేశిస్తూ “నేటికీ భారత్ స్వాతంత్ర సమరానికి అదే ప్రత్యేకత కలిగి ఉంది. ఆ ప్రత్యేకతను మనమందరం గౌరవించడం, అంతర్జాతీయ స్థాయికి ఎదగడమే మన బాధ్యత,” అని ట్వీట్ చేసారు. ఆయన ట్వీటర్ లో చేరిన గంటలోగానే ఆయనకు 8,000 మంది ఫాలోయర్స్ ఏర్పడ్డారు. రెండు గంటల వ్యవధిలోనే ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. ఆయన కుమార్తె శ్రుతీ హాస్సన్ ఆయనకు అభినందనలు తెలియజేస్తూ “ట్వీటర్ లో మీ ప్రవేశం చాలా సంతోషకరం. నేను అత్యంత అభిమానించే వ్యక్తి కమల్ హాసన్ కి ట్వీటర్ లోకి స్వాగతం. లవ్ యూ పప్పా,” అని ట్వీట్ చేసారు. ఆమెతో సహా చాలా మంది ఆయన ట్వీటర్ లో ప్రవేశించడాన్ని స్వాగతిస్తూ మెసేజులు పెట్టారు. కమల్ హాస్సన్ ట్వీట్ హ్యాండిల్ : @iKamalhaasan.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close