కాంగ్రెస్తో పొత్తు కోసం కేసీఆరే ప్రయత్నించారని.. కాంగ్రెస్ కాదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. ఇటీవల పీకే ఇష్యూలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంటుందని విస్తృత ప్రచారం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామంతో స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కాంగ్రెస్ తో పొత్తు కోసం కేసీఆర్ సోనియాను సంప్రదించారని ప్రకటించారు. అయితే సోనియా ఆ ప్రతిపాదనను నిర్మోహమాటంగా తిరస్కరించారని.. గతంలో మోసం చేసిన కేసీఆర్ను నమ్మేది లేదు.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని అప్పట్లో కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ లో విలీనం చేయలేదు.పైగా కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయడానిక చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేశారు. ఈ కారణంగానే ఆయనపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందని పొత్తులు పెట్టుకునే ప్రశ్నే లేదని కోమటిరెడ్డి అంటున్నారు. తెలంగాణలో గెలిచే పార్టీగా కాంగ్రెస్ ఉందని అందుకే.. కేసీఆర్ కాంగ్రెస్ జోలికి రావడం లేదన్నారు.
టీఆర్ఎస్తో కోమటిరెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. తాండూరు టీఆర్ఎస్లో జరుగుతున్న రగడలో సీనియర్ నేత మహేందర్ రెడ్డికి కోమటిరెడ్డి అండగా నిలిచారు. టీఆర్ఎస్లో ఆయనకు అన్యాయం జరుగుతోందన్నారు. తాండూరులో కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానంటున్నారు. దీంతో అక్కడ మహేందర్ రెడ్డిని ఆహ్వానిస్తే.. టీఆర్ఎస్ వీక్ అవుతుదని అనుకుటున్నారేమో కానీ ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు.
