మంత్రి కొండా సురేఖ తెలంగాణ కాంగ్రెస్ కు లేనిపోని చిక్కులు తీసుకొచ్చి పెడుతున్నారు. గతంలో సమంత ఇష్యూపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాలుక కరుచుకున్న ఆమె తాజాగా పార్టీని ఇరకాటంలోకి నెట్టేసేలా కామెంట్స్ చేశారు.కొంతమంది మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయాలంటే కమిషన్ తీసుకొంటున్నారని ఆరోపించారు. అవి బీఆర్ఎస్ ఆయుధంగా చేసుకొని .. కాంగ్రెస్ ను కమిషన్ సర్కార్ అంటూ చెడుగుడు ఆడుతోంది.
కొండా సురేఖ కామెంట్స్ వైరల్ కావడంతో ఆమె వివరణ ఇచ్చుకున్నారు. తాను గత ప్రభుత్వంలోని మంత్రులు కమిషన్ తీసుకున్నారని చెప్పానే తప్ప ప్రస్తుత మంత్రుల గురించి కాదంటూ వివరణ ఇచ్చారు. కానీ , అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎన్ని విధాలుగా వివరణ ఇచ్చినా ఆమె ఎం మాట్లాడారో స్పష్టంగా ఉంది.
వాస్తవాన్ని అంగీకరించారని కొండాకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కొండా వ్యాఖ్యలతో కేబినెట్ లోన్ మంత్రలపై రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డిలు విచారణకు ఆదేశించగలరా ? అంటూ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ అనుకూల సోషల్ మీడియా మొత్తం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలనే హైలెట్ చేస్తోంది.
మంత్రిగా ఆచితూచి మాట్లాడాలి..లేదంటే ఏం జరుగుతుందో గతంలో చేసిన వ్యాఖ్యల అనుభవం ఆమెకు ఉంది. దానిపై క్షమాపణలు కూడా కోరారు. గత అనుభవాన్ని అయినా దృష్టిలో ఉంచుకొని మసులుకోకపోతే ఇలాగే ఎక్కోలేక పీక్కోలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరిగితే కేబినెట్ నుంచి కొండాకు ఉద్వాసన తప్పదనే వార్తలూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె ఈ కామెంట్స్ చేయడం వేటుకు అవకాశం కల్పించేదే.