‘ఆచార్య‌’ రీషూట్ల‌పై కొర‌టాల క్లారిటీ

ఈమ‌ధ్య `రీషూట్‌` అనే మాట చాలా స‌ర్వ సాధార‌ణ‌మైపోయింది. అందులోనూ పెద్ద సినిమాల‌కు. ఏకంగా క్యారెక్ట‌ర్ల‌నే మార్చేసి, వాళ్ల‌పై తీసిన సీన్ల‌న్ని ప‌క్క‌న పెట్టి, మ‌ళ్లీ కొత్త‌గా సీన్లు రాసుకుని, తెర‌కెక్కించిన సంద‌ర్భాలున్నాయి. సినిమా పూర్త‌యినా, క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన సంద‌ర్భంలో.. ఆ సినిమాని చూసుకుని, మార్పులు చేర్పులు చేసుకునే అవ‌కాశం ద‌క్కింది. దాంతో.. రీషూట్లు మొద‌లైపోయాయి. ఆచార్య విష‌యంలోనూ చాలానే రీషూట్లు జ‌రిగాయ‌ని వార్త‌లొచ్చాయి. వీటిపై కొర‌టాల శివ తొలిసారి స్పందించారు. ఆచార్య‌కు రీషూట్లు ఏం జ‌ర‌గ‌లేద‌ని చెబుతూనే.. అస‌లు రీషూట్లు చేయ‌డం త‌ప్పేమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

“రీషూట్ అనేది ఓ త‌ప్పుడు భావ‌న కింద తీసుకుంటారు. రీషూట్ చేయ‌డంలో త‌ప్పేముంది? ఓ సీన్ అనుకున్న‌ట్టు రాక‌పోతే.. మ‌రోసారి తీయొచ్చు. స‌రిగా లేక‌పోయినా పాస్ చేయ‌లేం. అది సినిమాని న‌మ్మి వ‌చ్చే ప్రేక్ష‌కులకు అన్యాయం చేయ‌డం వంటిదే. ఓ సీన్ బాగా వ‌చ్చేంత వ‌ర‌కూ ఎన్నిసార్ల‌యినా తీయొచ్చు. అంతిమంగా ప్రేక్ష‌కుడికి ఆ సీన్ న‌చ్చేలా చేయ‌డ‌మే ద‌ర్శ‌కుడి బాధ్య‌త‌“ అని వివ‌ర‌ణ ఇచ్చారు. చిరంజీవి, చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన `ఆచార్య‌` ఈనెల 29న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రెండు నియోజకవర్గాల సమీక్షతోనే అలసిపోయారా !?

సీఎం జగన్ ఏదీ ప్రారంభించినా ఆర్భాటంగానే ఉంటుంది. కానీ తర్వాతే దాని గురించి అసలు పట్టించుకోరు. ప్రభుత్వ కార్యక్రమం అయినా.. పార్టీ కార్యక్రమం అయినా అంతే. నియోజకవర్గాల సమీక్షలను యాభై మంది కార్యకర్తలతో...

ఆ తిప్పలు టీచర్లకే కాదు.. త్వరలో ఉద్యోగులందరికీ !

ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. టీచర్లకు కొత్తగా సెల్ఫీ అటెండెన్స్‌ను తీసుకు వచ్చారు. తమ సొంత ఫోన్‌లో ప్రభుత్వం చెప్పిన యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని.. ఆ యాప్‌లో...

మ‌హేష్ – త్రివిక్ర‌మ్‌… ఇంత ఫాస్ట్ గానా?

అగ్ర హీరో సినిమా అంటే క‌నీసం ప్రొడ‌క్ష‌న్ కోసం యేడాది కేటాయించాల్సిందే. త్రివిక్ర‌మ్ లాంటి డైరెక్ట‌ర్ అంటే.... ఇంకా ఎక్కువ టైమే ప‌డుతుంది. ఎందుకంటే త్రివిక్ర‌మ్‌కి ఏదీ ఓ ప‌ట్టాన న‌చ్చ‌దు. మేకింగ్...

ఇక మోడీ టార్గెట్ రాజ్‌నాథ్ !

నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు వారంతా బీజేపీని నడిపించారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఎప్పుడైనా మోదీ ప్రధాని అభ్యర్థి అవడానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close