మ‌నిషి ప్రాణాల‌తో ఆడుకోవ‌ద్దు: కోట శ్రీ‌నివాస‌రావు ఆవేద‌న‌

ఈరోజు ఉద‌య‌మే ఓ దుర్వార్త‌. కోట శ్రీ‌నివాస‌రావు మ‌ర‌ణించార‌ని. సోష‌ల్ మీడియాలో ఇదే.. హాట్ టాపిక్‌. అయితే ఇది అచ్చంగా ఫేక్ వార్త‌. కోట ఆరోగ్యంగానే ఉన్నారు. ఇప్పుడు ఓ వీడియో కూడా వ‌దిలారు. ఇలాంటి ఫేక్ వార్త‌లు న‌మ్మొద్ద‌ని ఆయ‌న త‌న అభిమానుల్ని కోరారు. అంతేకాదు.. డ‌బ్బులు సంపాదించ‌డానికి చాలా మార్గాలున్నాయ‌ని, ఇలాంటి వార్త‌ల‌తో మ‌నిషి ప్రాణాల‌తో ఆడుకోవ‌ద్ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. “రేపు ఉగాది ఎలా చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే, పొద్దుటే ఏడున్న‌ర నుంచి ఒక‌టే ఫోన్లు. నేనే క‌నీసం 50 మందితో మాట్లాడి ఉంటాను. నేను బాగానే ఉన్నాన‌ని చెప్పుకొంటూ వ‌చ్చాను. నాకేదో అయిపోయింద‌ని మా ఇంటికి పోలీసు వ్యాను కూడా వ‌చ్చేసింది. ఇలాంటి ఫేక్ వార్త‌లు పుట్టించొద్దు. నాకంటే పెద్ద‌వాళ్ల‌యితే.. ఇలాంటి వార్త‌లు విని గుండాగి చ‌చ్చిపోతారు“ అంటూ ఓ సందేశాన్ని వీడియో రూపంలో ఉంచారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భాగ‌మ‌తి ద‌ర్శ‌కుడి ‘ఎస్‌.. బాస్‌’

పిల్ల‌జ‌మిందార్‌, భాగ‌మ‌తి చిత్రాల‌తో ఆక‌ట్టుకొన్నాడు అశోక్. ఆ త‌ర‌వాత‌.. అశోక్ ఓ సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. అప్ప‌టి నుంచి అశోక్ ఏం చేస్తున్నాడు? త‌న త‌దుప‌రి సినిమా ఎవ‌రితో అనే...

దక్షిణాదిలో తగ్గిపోయే లోక్‌సభ సీట్లపై కేటీఆర్ ఆందోళన!

దక్షిణాదికి దేశంలో ప్రాధాన్యం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లోక్ సభ సీట్లను తగ్గించబోతున్నారని చాలా కాలంగా పార్టీలు ఆరోపిస్తున్నాయి. 2026వ...

రైతు భరోసా క్యాలెండర్ తప్పింది !

జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసినా సంక్షేమ క్యాలెండర్ ను మాత్రం వదిలి పెట్టకుండా అమలు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ అది కూడా దారి తప్పుతోంది. చెప్పిన...

బింబిసార-2కి కొత్త దర్శకుడు?

కల్యాణ్‌ రామ్‌ సోషియో ఫాంటసీ 'బింబిసార’ మంచి విజయాన్ని అందుకుంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కి మళ్ళీ జోష్ తెచ్చింది. దీనికి పార్ట్ 2 వుంటుందని సినిమా ముగింపులోనే చెప్పారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close