కొత్తపలుకు : రెండు రాష్ట్రాల్లోనూ నియంతల రాజ్యమేనంటున్న ఆర్కే..!

ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు” రెండు రాష్ట్రాధినేతల నియంతృత్వ అంశాలను హైలెట్ చేయడానికి ప్రయత్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్టీసీ సమ్మె విషయంలో వ్యవహరిస్తున్న తీరును.. హైకోర్టుకు ఉన్న అధికారాలను సైతం ప్రశ్నించేందుకు దూకుడుగా వెళ్తున్న తీరును… విశ్లేషించారు. హుజూర్ నగర్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్.. మరింత కఠినంగా మారిపోయారని.. న్యాయస్థానాలు సైతం.. తనను ఆదేశించలేవని ఆయన అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. నిజానికి హైకోర్టుకు కేబినెట్ నిర్ణయాలను కూడా.. సమీక్షించే అధికారం ఉందని.. ఆర్కే చెబుతున్నారు. గతంలో.. అచ్చంగా ఇలానే.. ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ అంశంలోనే.. హైకోర్టు చేసిన వ్యాఖ్యలకే.. ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి రాజీనామా చేశారట. ఇదే విషయాన్ని ఆర్కే గుర్తు చేశారు. అయితే.. ఇప్పటికే…హైకోర్టు చాలా వ్యాఖ్యలు చేసింది. కానీ కేసీఆర్.. హైకోర్టునే తప్పు పడుతున్నారు. అంటే నియంతృత్వం దిశగా మరో అడుగు ముందుకేశారని… ఆర్కే అభిప్రాయం.

జగన్మోహన్ రెడ్డి కూడా.. కేసీఆర్ బాటలోనే పయనిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో.. అసలు ఓనమాలు కూడా పాటించడం లేదని.. జనవరి తర్వతా ఏపీలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి వస్తుందన్న అభిప్రాయానికి ఆర్కే వచ్చారు. అంతే కాదు.. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్యఅధికారి కూడా.. అస్త్రసన్యాసం చేయబోతున్నారట. ఈ విషయాన్ని వారి వారి సన్నిహితులకు చెబుతున్నట్లుగా ఆర్కే చెప్పుకొచ్చారు. పథకాలన్నీ అమలు చేయమని చెబుతారు కానీ.. నిధులు ఎలా సమీకరించుకోవాలో మాత్రం.. ముఖ్యమంత్రి చెప్పడం లేదట. అందుకే… ఈ సమస్య వస్తోందని అంటున్నారు.

రాజకీయంగానూ కేసీఆర్‌నే జగన్ ఫాలో అవుతున్నారని.. ఆర్కే చెబుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీ వీడకపోతే.. ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేమన్న హెచ్చరికలు కూడా.. పంపారని ఆర్కే అంటున్నారు. నిజంగా ఇలాంటి హెచ్చరికలే పంపి ఉంటే.. దేశ రాజకీయాల్లో ఎవరూ ఊహించనంత స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం దిగజారిపోయిందనుకోవాలి. రాజకీయాలు వేరు..వ్యక్తిగతం వేరు అనుకునే పరిస్థితి నుంచి… అధికారం అడ్డు పెట్టుకుని చంపుతామనే స్థితికి.. రాజకీయం చేరిపోయిందంటే…. కేసీఆర్‌ కంటే మిన్నగా.. జగన్ నియంతృత్వం బాటలో వెళ్తున్నారని అనుకోవాలి.

విజయవాడలో జరగాల్సిన ప్రెస్‌డే వేడుకలను నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనికి కారణం… ఆ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొంటున్నారు. ఆయన పాల్గొంటే.. తాను పాల్గొనడం ఏమిటని.. జగన్ .. రానని చెప్పేశారట. అందుకే.. విజయవాడలో జరగాల్సిన కార్యక్రమాన్ని రర్దు చేసుకున్న ప్రెస్ కౌన్సిల్.. హడావుడిగా ఢిల్లీలో ఏర్పాట్లు చేసుకుంది. జగన్ మనస్థత్వంలో ఇదో కోణం అని ఆర్కే చెప్పకనే చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close