ఆ క‌థ ప‌వ‌న్ కోసం కాదు.. వ‌రుణ్ కోసం

ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్‌లో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు తెర‌కెక్కుతోంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమాపై క్రిష్ చాలా న‌మ్మ‌కం పెట్టుకున్నాడు. త‌న‌కు క‌మ‌ర్షియ‌ల్ హిట్లు కొట్ట‌డం చేత‌కాదు… అనే విమ‌ర్శ‌ను ఈ సినిమాతో తిప్పి కొట్ట‌డానికి ఫిక్స‌య్యాడు. అందుకోసం… ఈ సినిమాలో అన్ని ర‌కాలైన క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్స్ మిక్స్ చేస్తున్నాడు.

అయితే నిజానికి ఇది వ‌ప‌న్ కోసం రాసుకున్న క‌థ కాదు. వ‌రుణ్ తేజ్ కోసం రాసింది. కంచె త‌ర‌వాత వ‌రుణ్‌తో ఓ మ‌రో సినిమా చేద్దామ‌నుకున్నాడు క్రిష్‌. అప్పుడే `వీర‌మ‌ల్లు` క‌థ కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. కానీ వ‌రుణ్ మార్కెట్ కీ, ఈ సినిమా బ‌డ్జెట్ స‌హ‌క‌రించ‌లేదు. వ‌రుణ్ తేజ్ మార్కెట్ కంటే బ‌డ్జెట్ రెండు మూడింత‌లు ఎక్కువ కావ‌డంతో… ఈ క‌థ‌ని ప‌క్క‌న పెట్టారు. ఆ స‌మ‌యంలోనే.. జేమ్స్ బాండ్ త‌ర‌హా స్టైలీష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ స్క్రిప్టు త‌యారు చేశారు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ.. ఆ క‌థ కూడా ప‌క్క‌కు వెళ్లిపోయింది. అప్ప‌టి వ‌రుణ్ కోసం అనుకున్న క‌థ‌.. ఇప్పుడు ప‌వ‌న్ చేతికి చేరింది. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ ఇష్యూలో పవన్ ఎంట్రీ – కేంద్ర హోంశాఖకు …

ఆనం రామనారాయణ రెడ్డి లాంటి సీనియర్ నేత తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన చెందుతున్నా, డీజీపీ ఆయన భద్రతపై బాధ్యత తీసుకోకపోతే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని జనసేన అధినేత పవన్...

నెల్లూరు రూరల్ – అదాల ప్రభాకర్ – వైసీపీకి పీడకలే !

నెల్లూరు ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజవకర్గానికి ఇంచార్జ్ గా నియమించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీపై ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో ఆయనను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు....

సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా టీడీపీ ముద్ర – వైసీపీకి ఏం దుస్థితి ?

సొంత పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ప్రభుత్వాన్ని చుట్టుముడితే అది టీడీపీ సమస్య అన్నట్లుగా తప్పించుకోవాలని చూస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ట్యాపింగ్ సమస్య విపక్ష నేతలు చేస్తే... అది రాజకీయం...

స‌ర్‌ప్రైజింగ్ కాంబోలో… సందీప్ సినిమా

'అండ‌ర్ రేటెడ్‌' ట్యాగ్ వేసుకొన్న హీరో.. సందీప్ కిష‌న్‌. పాపం.. క‌ష్ట‌ప‌డుతుంటాడు కానీ, స‌రైన ఫ‌లితాలు రావ‌డం లేదు. త‌న‌ రెండేళ్ల క‌ష్టం.. 'మైఖేల్‌'. ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వ‌డంలో, ఇలా.. భారీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close