ప‌వ‌న్ టైటిల్‌… క్రిష్ సైలెన్స్‌

ఓ స్టార్ హీరో సినిమా సెట్స్ పై ఉందంటే.. దాని చుట్టూ బోలెడ‌న్ని ఊహాగానాలు. ప్రీ లుక్ చూసి, అందులో హీరో గెట‌ప్ ని చూసి క‌థేంటో ఊహించేస్తారు ఫ్యాన్స్‌. పోస్ట‌ర్లూ, టైటిళ్లూ వాళ్లే వ‌దిలేస్తుంటారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. ఈ సినిమా టైటిల్ ఏమిటో ఇప్పటి వ‌ర‌కూ చిత్ర‌బృందం ప్ర‌క‌టించ‌లేదు. అయితే బ‌య‌ట మాత్రం బోలెడ‌న్ని పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. విరూపాక్ష‌, గ‌జ‌దొంగ‌, ఓం శివ‌మ్ – ఇలా రోజుకో పేరు బ‌య‌ట‌కు వ‌స్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈసినిమా టైటిల్ ప్ర‌క‌టిస్తార‌నుకున్నారంతా. కానీ…. క్రిష్ మాత్రం ప్రీ లుక్‌కే ప‌రిమిత‌మైపోయాడు. దాంతో టైటిళ్ల‌పై ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి.

తాజాగా `అంత‌ర్వాహిణి` అనే మ‌రో టైటిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ చిత్రానికి మాట‌ల ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తున్నారు సాయి మాధ‌వ్ బుర్రా. ఆయ‌న త‌న ఫేస్‌బుక్ లో `అంత‌ర్వాహిణి` అనే ఓ పేరు మీద ఓ క‌విత రాస్తే, దాన్ని క్రిష్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. అదిచూసి ఈసినిమాకి `అంత‌ర్వాహిణి` అనే టైటిల్ ఫిక్స్ చేశార‌ని ఫ్యాన్స్ ఊహాగానాలు మొద‌లెట్టేశారు. అయితే ఇప్పుడు కూడా క్రిష్ స్పందించ‌లేదు. ఈ ద‌స‌రాకి క్రిష్‌.. టైటిల్ ని ఫిక్స్ చేస్తార‌ని స‌మాచారం. అప్ప‌టి వ‌ర‌కూ జ‌నాలు ఏం మాట్లాడుకుంటున్నా, స్పందించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నార్ట‌. `విరూపాక్ష‌` అనే టైటిల్ ని క్రిష్ ప‌రిశీలిస్తుంద‌న్న మాట నిజం. కానీ… దానికంటే సుల‌భంగా అర్థ‌మై, క్యాచీగా ఉండే టైటిల్ కోసం క్రిష్ అన్వేషిస్తున్నాడ‌ని తెలుస్తోంది. గ‌మ్యం, వేదం, కంచెలానే ఇది కూడా రెండు అక్ష‌రాల టైటిల్ అనే తెలుస్తోంది. మ‌రి.. ఆటైటిల్ ఏమిటో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీ విద్యార్థుల్ని కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేస్తున్నారా..!?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థమవడం లేదు. బస్సుల నుంచి మద్యం వరకూ ..ఉద్యోగాల నుంచి చదువుల వరకూ అన్నింటిపైనా పొరుగు రాష్ట్రాలపైనే ఏపీ ప్రజలు ఆధారపడేలా విధానాలు...

“పోస్కో” చేతికి విశాఖ స్టీల్ ప్లాంట్..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రెండు రోజుల కిందట... పోస్కో అనే స్టీల్ ఉత్పత్తిలో దిగ్గజం లాంటి పరిశ్రమ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్...

జగన‌ చల్లని చూపు కోరుకుంటున్న సీపీఎం..!

ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టుల పయనం.. భిన్న కోణాల్లో సాగుతోంది. సీపీఐ యాంటీ జగన్ నినాదంతో దూసుకెళ్తుండగా.. సీపీఎం మాత్రం వైసీపీ నీడలో సేదదీరుతోంది. జగన్ నిర్ణయాల్ని సమర్థిస్తోంది. ఆ పార్టీకి వైసీపీ ఎక్కడా కనీస...

ఏపీ అంటే జోకా ? పోలవరం ఆ నిధుల్లోనూ మళ్లీ కోత..!

దుబాయ్ శీను సినిమాలో ముంబైలో ఉండే పట్నాయక్ రవితేజ అండ్ గ్యాంగ్‌ని ఎలా బకరాని చేస్తారో చాలా సార్లు చూశాం. వారికివ్వాల్సిన డబ్బుల్ని ఎన్ని రకాలుగా కోత పెట్టి చివరికి మీరే బాకీ...

HOT NEWS

[X] Close
[X] Close